29.7 C
Hyderabad
May 1, 2024 06: 41 AM
Slider కడప

పోగొట్టుకున్న విలువైన ఆభరణాలను తిరిగి ఇప్పించిన పోలీసులు

#kadapapolice

ఆటోలో వెళుతూ రూ.1.62  లక్షల రూపాయల విలువైన బంగారు, వెండితో బ్యాగును పోగొట్టుకున్న మహిళకు కడప పోలీసులు తక్షణమే పోయిన సొమ్ము తిరిగి ఇప్పించారు. కేవలం 30 నిమిషాల్లోనే శ్రమించి వెదికి ఆటోను గుర్తించి బ్యాగును సురక్షితంగా బాధిత మహిళకు అందచేశారు. రాయచోటి , కాటి మానుకుంట కి చెందిన షేక్ అస్మా అనే మహిళ శుభకార్యానికి వచ్చి తిరిగి రాయచోటి వెళ్లేందుకు మహిళ చిలకల బావి వచ్చి ఆటోలో  పాత బస్టాండ్ లో హ్యాండ్, లాగేజ్ బ్యాగ్ ను ఆటోలో మరచిపోయింది.

కడప వన్ టౌన్ సి.ఐ NV నాగరాజు  కు బాధితురాలు మధ్యాహ్నం 4.00 గం.లకు ఫిర్యాదు చేసింది. వెంటనే సి.ఐ NV నాగరాజు ఐడి పార్టీ సిబ్బంది ఖాదర్ హుస్సేన్, కిరణ్ ని అప్రమత్తం చేశారు. పాత బస్టాండ్ సమీపంలోని సి.సి కెమెరాల ఫుటేజీ ని కమాండ్ కంట్రోల్ సెంటర్ వీడియో వాల్ లో పోలీసులు పరిశీలించారు. కేవలం 30 నిమిషాల్లో ఆటో ను గుర్తించి బాధితురాలికి హ్యాండ్ బ్యాగ్ ను 1 టౌన్ సిఐ నాగరాజు అప్పగించారు.  తాను పోగొట్టుకున్న బంగారు, వెండి హ్యాండ్ బ్యాగ్ ను ఎంతో శ్రమించి తనకు అప్పగించిన పోలీసు శాఖ కు షేక్ అస్మా కృతజ్ఞతలు తెలిపింది. కేవలం 30 నిమిషాల్లోనే ఆటోను గుర్తించి అందులోని బాధితురాలి కి అందించేందుకు కృషి చేసిన కడప వన్ టౌన్ సిఐ Nv నాగరాజు, ఐడి పార్టీ సిబ్బంది కానిస్టేబుల్ ఖాదర్ హుస్సేన్, కిరణ్ లను జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ అభినందించారు.

Related posts

కుంభోత్సవం సందర్భంగా 11న శ్రీశైలం ఆలయ వేళలలో మార్పు

Satyam NEWS

మళ్లీ ముంచుకొస్తున్న మహమ్మారీ: భారీగా కరోనా కేసులు

Bhavani

ఉపాధ్యాయ పోస్టులు పెంచి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment