40.2 C
Hyderabad
May 2, 2024 16: 15 PM
Slider ఆదిలాబాద్

తప్పిన ముప్పు: కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి

#MinisterIndrakaranReddy

కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు  ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు వాటర్ ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండి.. అవుట్ ఫ్లో తక్కువగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అధికారులు ఆందోళన పడ్డారు. ప్రస్తుతానికి వరద తగ్గడంతో ప్రమాదం తప్పింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని, ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో  పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.

ప్రజలు ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.  ప్రస్తుతానికి ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లో ఉందని తెలిపారు. వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు కాగ… ఔట్ ఫ్లో 2 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొన్నారు. మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్ననామని, వరద ఉద్దృతిని బట్టి క్రమంగా  గేట్లను దించేస్తామని పేర్కొన్నారు.

భయానక పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన  నీటిపారుదల అధికారులు,  రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల అధికారులను, జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యల్లో నిమగ్నమైన కలెక్టర్ ముష్రఫ్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఇతర అధికారులు ఈ సందర్భంగా అభినందించారు.

Related posts

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డి

Satyam NEWS

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఎమ్మార్పీఎస్

Satyam NEWS

హిమాచల్‌లో హామీలు అమలు చేస్తాం

Murali Krishna

Leave a Comment