29.7 C
Hyderabad
May 2, 2024 06: 33 AM
Slider నల్గొండ

ఇళ్ళు లేనివారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వాలి

#cituhujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల సర్వేలో అనేక సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ అన్నారు.

భవన నిర్మాణ సంఘం హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు ఉపతల వెంకన్న ఆధ్వర్యంలో పట్టణం లోని సీతారాంనగర్ లో జరిగే సర్వేకి ముఖ్య అతిథిగా సోమయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఈ సర్వేలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని,సర్వేలో వచ్చిన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు జిల్లా వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమవుతామని,ప్రధానంగా నిర్మాణ రంగా కార్మికులు సొంత ఇళ్ళు లేక పోవడం,కిరాయి ఇండ్లలో కిరాయిలు చెల్లించలేక ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారని,తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని సోమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,భవన నిర్మాణ సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న,జక్కుల సురేష్,బుడిగ సత్యనారాయణ,సంపంగి నరసింహ, సంపంగి ఉపేందర్,బాలు,శ్రీకాంత్,అశోక్, మౌనిక,పద్మ,రమణ,సీతమ్మ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

విద్యార్థినుల‌కు హెల్త్ కిట్లు పంపిణీకి స‌ర్కారు చ‌ర్య‌లు

Bhavani

మున్నూరు కాపుల డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా

Satyam NEWS

ఏపిలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇది

Satyam NEWS

Leave a Comment