38.2 C
Hyderabad
May 2, 2024 22: 38 PM
Slider సినిమా

వెరైటీ: భారతీయుడు 2లో కాజల్ ఎలా కనిపిస్తుంది?

అందాల తార కాజల్ అగర్వాల్ వృద్ధురాలి పాత్రలో ఎలా కనిపిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం త్వరలో రాబోతున్నది. భారతీయుడు 2 లో కాజల్ 85-ఏళ్ళ మహిళ పాత్రను పోషిస్తున్నదట. ముంబైలో అంతర్జాతీయ స్థాయి కళాకారులు సుబ్రమణియన్ గోపాలసామి, జ్ఞానాడికం పొన్నుసామి ల కళా ప్రదర్శనను సందర్శించిన సమయంలో కాజల్ మీడియాతో కొద్ది సేపు మాట్లాడింది.

ఈ అంశంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇది చాలా అద్భుతమైన పాత్ర కానీ దాని గురించి నేను మీకు ఎక్కువ చెప్పలేను. వారు (సినిమా మేకర్స్) నన్ను చంపేస్తారు! “అంటూ కాజల్ సమాధానం దాటవేసింది. దర్శకుడు శంకర్ నేతృత్వంలో ప్రారంభం కానున్న ఈ భారతీయుడు 2 లో కాజల్ కమల్ హసన్ నటిస్తున్నారు. బహుశ  ఫిబ్రవరిలో షూటింగ్ ను పునఃప్రారంభిస్తారు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

ఇలాంటి పాత్ర నేనెప్పుడూ చేయలేదు అని చెబుతున్నది కాజల్. భారతీయుడు 2 కాకుండా, ఆమె రాబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, “నేను డిఫరెంట్ కంటెంట్ కోసం చూస్తున్నాను. నేను చాలా ఉత్తేజకరమైన, విభిన్నమైన తరహా చిత్రాలకు పని చేస్తున్నాను’’ అని చెప్పింది.

Related posts

జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ లక్షణాలతో ఆందోళన చెందవద్దు

Satyam NEWS

పాలకులు ఇక సామాన్యుడిని బతకనిస్తారా?

Satyam NEWS

వై ఎస్ షర్మిల గారూ ఆంధ్రా బిడ్డగా ఒక సారి మమ్మల్ని చూడండి

Satyam NEWS

Leave a Comment