29.7 C
Hyderabad
April 29, 2024 10: 17 AM
Slider ప్రత్యేకం

వై ఎస్ షర్మిల గారూ ఆంధ్రా బిడ్డగా ఒక సారి మమ్మల్ని చూడండి

#sunkarapadmashree

తెలంగాణ కోడలిగా పోరాటం చేస్తున్న వై ఎస్ షర్మిల ఆంధ్రా బిడ్డగా ఒక్క సారి అమరావతి రైతుల గోడు చూడాలని అమరావతి రైతులు కోరుతున్నారు. ఒక్క సారి పోలీసులు దీక్ష భగ్నం చేస్తేనే గగ్గోలు పెడుతున్న షర్మిల ఆంధ్రప్రదేశ్ లో ఆమె అన్న అధికారంలో ఉన్న చోట తమపై పలు మార్లు పోలీసు లాఠీలు విరిగాయని వారు చెప్పుకుంటున్నారు. వై ఎస్ షర్మిలకు అమరావతి మహిళా జేఏసీ తరపున సుంకర పద్మశ్రీ రాసిన లేఖ పూర్తి పాఠం

వైఎస్ షర్మిల గారికి,

ఇటీవల మీరు తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం చేసిన ధర్నా సందర్భంగా గాయపడటం విని సాటి మహిళలుగా బాధపడ్డాం. మీ పోరాటంలో ఎంత న్యాయం ఉందో, మేం 491 రోజులుగా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ అప్రతిహతంగా చేస్తున్న ఆందోళనలోనూ అంతే న్యాయం ఉంది. మిమ్మల్ని కేవలం ఒక్కసారి మాత్రమే పోలీసులు అవమానించి, గాయపరిచారు.

కానీ మమల్ని ఏడాది నుంచీ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ప్రతిరోజూ అవమానించి, గాయపరుస్తున్న విషయం మీకు తెలియనిది కాదు. తెలంగాణలో మీ పోరాటానికి మీ వదిన భారతీరెడ్డి సారథ్యంలోని సాక్షి మీడియా ఏవిధంగా కవరేజీ ఇవ్వడం లేదో, ఇక్కడ మా అమరావతి మహిళా పోరాటానికీ మీ వదినమ్మ సాక్షి మీడియా కవరేజీ ఇవ్వకపోగా, మాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నది. ఈ విషయంలో మనం ఇద్దరమూ సాక్షి మీడియా బాధితులమే.

మీపై జరిగిన దాడికి తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి సమాధానం ఇవ్వాలని మీ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలయిన విజయమ్మ డిమాండ్ చేశారు. నిజమే. దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదేవిధంగా అమరావతిలో మాపై ప్రతిరోజూ వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులకు మీ అన్న జగన్మోహర్‌రెడ్డి ప్రభుత్వం కూడా దిగివచ్చి సమాధానం చెప్పడమే ధర్మం కదా? విజయమ్మ గారు, మీరు ఈ విషయంలో జగన్ కి ఓమాట చెబితే తెలంగాణలో మీరు చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత ఉంటుంది.

షర్మిల గారూ..

అమరావతి కోసం మేం చేస్తున్న ఆందోళనకు మీ మద్దతు ఆశిస్తున్నాం. తెలంగాణ కోడలిగా మీరు అక్కడ పోరాటం చేస్తున్నట్లే, ఆంధ్రా బిడ్డగా మేం చేస్తున్న పోరాటానికి స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. ఆ మేరకు మిమ్మల్ని ఆహ్వానించేందుకు అమరావతి మహిళా జేఏసీ ప్రతినిధి బృందం మీ వద్దకు రావాలనుకుంటున్నాం. కాబట్టి మీ  అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఒకవేళ కోవిడ్ తీవ్రత కారణంగా మీరు రాలేకపోయినప్పటికీ, మా పోరాటానికి మద్దతునిస్తున్నట్లు పత్రికా ప్రకటన అయినా ఇచ్చినా మా పోరాటానికి మేలు చేసినవారవుతారు. మీ సమాధానం కోసం ఎదురుచూస్తూ…

సుంకర పద్మశ్రీ

అమరావతి మహిళా జేఏసీ

Related posts

నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి నీరు విడుదల

Satyam NEWS

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

Bhavani

ఆపరేషన్ వికటించి ఒక మహిళ మృతి

Satyam NEWS

Leave a Comment