30.3 C
Hyderabad
March 15, 2025 09: 19 AM
Slider మహబూబ్ నగర్

పాలకులు ఇక సామాన్యుడిని బతకనిస్తారా?

#Kalwakurthy Municipality

ఈ భూమి మీద సామాన్యుల్ని ఈ పాలకులు బతకనిచ్చేనా అనే అనుమానం ప్రస్తుత పరిస్థితులను విధివిధానాలను చూస్తుంటే అనుమానం వ్యక్తమవుతోంది. కరోనా రోగం బారిన పడకుండా కొన్ని కట్టుదిట్టమైన చర్యలలో భాగంగా ముఖానికి మాస్క్ ధరించాలి.

ధరించని వారిపై 1000 రూపాయల జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సందర్భంగా బ్రతుకే భారమైన ప్రస్తుత పరిస్థితుల్లో పాలకులు ప్రజల ప్రాణాల కంటే ఆదాయం వైపే మొగ్గు చూపడం పాలకుల క్రూరత్వాన్ని కనులకు కట్టినట్లు  కనిపిస్తుంది. మాస్కులు, సానిటైజర్లు ప్రజల ప్రాణాలు నిలబెడతాయే లేదో తెలియదు కానీ పాలకుల పాలనలో పది రూపాయల  విలువగల మాస్క్ కొందామంటే 60 రూపాయలు చెబుతున్న వ్యాపారులపై చర్య తీసుకోరు.

అదే విధంగా సానిటైజరు కొందామంటే 150 నుండి 200 వరకు అధిక ధరలు అమ్ముతున్న వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడాన్ని చూస్తుంటే వ్యాపారస్తులకు వంత  పాడుతున్నట్లు అనిపిస్తుంది. అవి వాడకపోతే మాత్రం చలానా కట్టాల్సిన పరిస్థితి ఉంది.

బతకలేక ఛస్తుంటే ఈ బాదుడేంది?

ప్రస్తుతం జీవనం సాగించాలంటేనే  ఇంటి అద్దెలు కరెంటు బిల్లులు ఈ ఎం ఐ లు బ్యాంకు లోన్ లు అప్పుల బాధలు వడ్డీలు  బ్రతుకు జీవుడా అంటున్న సమయంలో  ఈ కరోనా రోగంతో బ్రతుకు భారమై సగటు జీవి చావలేక బతకలేక ఎటు తోచని అయోమయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నాడు.

ఇటువంటి సమయంలో కరోనా బారిన పడకుండా చూసే బాధ్యత పాలకులతే. ఆదాయం కోసం చూడకుండా ఇతర విధి విధానాలను అనుసరించి కూడా ప్రజలకు అవగాహన కల్పించవచ్చు. సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరలకు మాస్కులు, సానిటైజర్లు విక్రయించేందుకు చర్యలు చేపట్టాలి. అంతేకానీ ఇలా చలానలు వేస్తుంటే ఎలా?

Related posts

చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఎంజీఆర్

Satyam NEWS

డ్ర‌గ్స్ నుంచి బాల‌లను దూరం చేసేందుకు సంయుక్త కార్యాచ‌ర‌ణ‌….!

mamatha

బీజేపీ జెండా కూల్చిన వారిపై చర్యలకు డిమాండ్

mamatha

Leave a Comment