40.2 C
Hyderabad
May 2, 2024 18: 16 PM
Slider మహబూబ్ నగర్

ప్రాధేయ పడితేనే పర్మిషన్ అడుక్కుంటే నే అనుమతి

kalwakurthy shops

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రాణాలకు తెగించి నిత్యవసర వస్తువులు అందిస్తున్న వ్యాపారులు పోలీసులను ప్రాధేయ పడితేనే పర్మిషన్లు అడుక్కుంటూనే అనుమతులు ఇస్తామంటున్నారు. అయినవారికి ఆకులు కాని వాడికి కంచాల్లో అన్న చందంగా కల్వకుర్తి పోలీసులు వ్యవహరిస్తున్నారు.

నిత్యవసర వస్తువులు కాని దుకాణాల్లో పైకి కిరాణా దుకాణం అని బోర్డు తగిలించుకొని కొందరు వ్యాపారం కొనసాగిస్తున్నారు. కాగా నిత్యవసర వస్తువులు అందించే వ్యాపారులపై వారి జులుం ప్రదర్శిస్తున్నారు.  నిత్యావసర దుకాణాలలో కూడా వంద రకాలు ఉన్నను వాటిలో కొన్ని మాత్రమే నిత్యావసర సంబంధించినవి ఉంటాయి.

మిగిలినవి నిత్యావసర వస్తువుల కిందికి రావు. దీంతో వారికి నచ్చని వ్యాపారస్తులపై ప్రత్యేకంగా ఇవి నిత్యవసర వస్తువులు కావు కదా అంటూ వారి దుకాణాలను మూసి వేయాలని లేకుంటే రిమాండ్ కు తరలిస్తామని బెదిరిస్తున్నారు.

ఈ విషయాన్ని అడిగితే మమ్మల్ని ప్రాధేయ పడాలని అప్పుడే పర్మిషన్ ఇస్తామని అంటున్నారు. కొన్ని శీతల పానీయాల దుకాణాల అమ్మకాలు సాగిస్తుంటే మరికొందరిని మాత్రం మూసివేయాలని హెచ్చరిస్తున్నారు. ఇరువురు దుకాణాల్లో లో అమ్మకాలు  ఒకటే కానీ కొందరిని మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేసి  రిమాండ్ కు తరలిస్తారని బెదిరించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొందరిపై గుర్రు, మరి కొందరి పై కక్ష సాధింపు చర్యలపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద కల్వకుర్తి పోలీసులు వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts

సంపద ఏకీకృతం చేసి దోచుకుంటున్న ముఖ్యమంత్రి

Satyam NEWS

దేశాన్ని కాపాడేందుకే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి !

Satyam NEWS

నిరాధార కుటుంబాన్ని ఆదుకున్న ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment