37.2 C
Hyderabad
May 2, 2024 14: 54 PM
Slider నిజామాబాద్

కంగ్రాట్స్: కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కు కేసీఆర్ అభినందన

#Collector Sharat

నేడు 31 జిల్లాల కలెక్టర్లతో జరిగిన సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోట వచ్చిన మాట కంగ్రాట్స్ కలెక్టర్ శరత్. జాతీయ ఉపాది హామీ పథకంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా ఉంది. తెలంగాణలో కామారెడ్డి జిల్లా నెంబర్ 1 గా నిలించినందుకు సంతోషంగా ఉంది.

ఈ మొత్తం సంవత్సరానికి నిర్ధేశించిన లక్ష్యం కోటి 20 లక్షల పనిదినాలకు గాను ఈ రెండు నెలల్లో 90 లక్షల పనిదినాలను జిల్లా యంత్రాంగం సాధించింది. 70 శాతం పనిదినాలు ఈ రెండు నెలల్లో సాధించడం అభినందనీయం. గత సంవత్సరంతో పోలిస్తే  కేంద్రం నుండి ఈ పథకం కోసం కామారెడ్డి జిల్లాకు 70 కోట్లు వస్తే ఈ సారి 146 కోట్లు ఇప్పటికే వచ్చాయి. 75 శాతం లక్ష్యం ఈ రెండు నెలల్లోనే సాధించారు.

33 జిల్లాల్లో ఈ పథకంలో కామారెడ్డి ఆదర్శంగా నిలించింది. వేసవిలో రోజుకు 2.50 లక్షల మంది పనిచేశారు. ఈ సీజన్లో కూడా లక్ష 20 వేల మంది పనిచేశారు. చెరువుల్లోని సారవంతమైన మట్టిని రైతులను సమాయాత్తం చేసి వారి పొలాలకు ఈ మట్టిని తరలించడంతో జిల్లా యంత్రాంగం సక్సెస్ అయ్యింది. జిల్లాలోని 1225 చెరువుల్లో  పూడిక తీతపని పూర్తయ్యింది. దాంతో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ ను కంగ్రాట్స్ అంటూ అభినందించారు సీఎం కేసీఆర్.

Related posts

ప్ర‌తీ మ‌హిళ‌లోనూ అమ్మ‌ను చూడ‌గ‌లిగిన‌ప్పుడే సంపూర్ణ సంస్కారం

Satyam NEWS

నిబంధనలు పాటిస్తే  ప్రమాదాలు తగ్గించవచ్చు

Murali Krishna

జగన్ రెడ్డి ముసుగు తొలగింది: ఎన్ డీ ఏ సమావేశానికి ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment