39.2 C
Hyderabad
May 3, 2024 11: 35 AM
Slider కరీంనగర్

ఫర్ పీపుల్:ప్రజల రక్షణ భద్రతపై భరోసా కే తనిఖీలు

karimnagar cordon and search additional dcp srinivas

ప్రజల సంరక్షణకు పోలీస్ లు ఉన్నారని వారి రక్షణ భద్రతపై భరోసా కే ప్రతి వారం కార్డాన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అడిషనల్‌ డిసిపి లాఅండ్ఆర్డర్ ఎస్. శ్రీనివాస్‌అన్నారు. కరీంనగర్‌ పోలీస్‌ కమీషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారంనాడు పోలీసులు రూరల్‌పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బొమ్మకల్‌గ్రామం కృష్ణానగర్‌లో పోలీసులు కార్డన్‌అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు.ఉదయం 5:30గంటల నుండి 7:30గంటల వరకు ప్రతి అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహించారు.

అనంతరం కాలనీవాసులతో ఏర్పాటైన కార్యక్రమంలో అడిషనల్‌ డిసిపి(ఎల్‌అండ్‌ఓ) ఎస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజల రక్షణ,భద్రతపై భరోసా కల్పించేందుకు ఆకస్మికంగా తనిఖీలను చేస్తున్నామన్నారు. ఆకస్మిక తనిఖీల ద్వారా అసాంఘీక, అక్రమ కార్యకలాపాలు వెలుగులోకివస్తున్నాయని పేర్కొన్నారు. పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు అన్నివర్గాల ప్రజలు సహకారం అందిస్తున్నారని చెప్పారు.

కృష్ణానగర్‌ ప్రాంతం శివారులో ఉన్నందున ఇక్కడి నివాసులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అద్దెదారుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అద్దెదారులకు సంబంధించిన వివరాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో తెలిపినట్లయితే నిమషాల వ్యవధిలో సదరు వ్యక్తులకు సంబంధిత సమాచారం ఉచితంగా అందజేస్తామని తెలిపారు.

ఇంటి యజమాను లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కాలనీవాసులు సిసి కెమెరాల
ఎర్పాటుకు స్వచ్చందంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. సిసి కెమెరాల ఫుటేజీల ద్వారా ఇప్పటి వరకు ఛేదించబడిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు.

ట్రెనీ ఐపిఎస్‌ అధికారిణి నిటికపంత్‌ మాట్లాడుతూ ప్రజల రక్షణ,భద్రతకోసం పోలీస్‌శాఖ పలుచర్యలను తీసుకుంటున్నదన్నారు. అనుమానిత వ్యక్తుల సంచారంనకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు.

ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలులేని వివిధ రకాలకు చెందిన 208వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌రూరల్‌ ఏసిపి విజయసారధి, ఇన్స్‌పెక్టర్లు తుల శ్రీనివాసరావు, మహేష్‌గౌడ్‌,సంతోష్‌కుమార్‌, ఆర్‌ఐలు మల్లేశం,జానిమియా,శేఖర్‌, ఎస్‌ఐలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌,ఎల్లయ్యగౌడ్‌లతోపాటుగా వివిధ విభాగాల కు చెందిన 150మంది పోలీసులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ ధ్యేయం

Murali Krishna

భగవద్గీతను శవయాత్రలలో వినిపించడం నిషేధం

Satyam NEWS

కేటీఆర్…మళ్ళీ రాళ్లేయడాని కే వస్తున్నారా…?

Satyam NEWS

Leave a Comment