42.2 C
Hyderabad
May 3, 2024 18: 11 PM
Slider శ్రీకాకుళం

కార్తీక పౌర్ణమి సందర్భంగా పల్లెటూరులో ప్రాణాయామం

#Swamyjee

కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశంలోని అని పుణ్యక్షేత్రాలతో పాటు…పలు ఆశ్రమాలలో మహర్షుల పూజాది కార్యక్రమాలు జరిగాయి. పలు శివాలయాల్లో అభిషేకాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ లావేరు మండలం ఓ చిన్న కుగ్రామంలో స్వామి రామానంద యోగజ్ఞాన ఆశ్రమ శిష్యులు… సామూహికంగా కార్తీకపౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు.

హంగు ఆర్భాటం లేకుండా, ప్రచార ప్రభావం జరపకుండా సాదాసీదాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అపరవాల్మీకి శ్రీ స్వామి శివానంద పరమహంస జన్మదిన సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి శ్రీగురూజీ (డా.వీ.వెంకటేశ్వరరావు)చే కొత్తగా నిర్మించిన ధ్యానమందిరం ప్రారంభించబడింది.

అక్షర జ్ఞానం లేని హనుమంతపురం గ్రామస్థులు..ప్రాణాయామ జ్ఞానం తో సామూహికంగా యోగం చేసి..తమ భక్తి భావంతో శ్రీగురూజీ స్వాగతింప చేసింది. కేరళలో బడగరలో  శ్రీ స్వామి శివానంద ఆశ్రమాన్ని తలపించే విధంగా శిష్యులంతా తెల్లని వస్త్రాలతో శ్రీగురూజీ శిష్యబృందానికి స్వాగతం పలికారు.

అల్పా ఆహారం, ప్రసాదవితరణతో ఆద్యంతం జరిగింది. ఈ సందర్భంగా శ్రీగురూజీ… శిష్యులనుద్దేశించి…బ్రహ్మ విద్య, ప్రాణాయామం సాధన దాని ఫలితాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీగురూజీ సతీమణి పార్వతి, హనుమంతపురం గ్రామస్థులు రమణ ,రాజు ,ఇతర శిష్యులు గోపీ ,విజయగోపాల్, కుమార్, జగ్గారావు ఇతరులు హాజరయ్యారు.

Related posts

రిటర్నింగ్ అధికారిగా మైనారిటీ తీరని బాలుడు

Satyam NEWS

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు రద్దు

Satyam NEWS

బాలుడిపై అత్యాచారం చేసిన అరబిక్ టీచర్

Satyam NEWS

Leave a Comment