36.2 C
Hyderabad
April 27, 2024 21: 49 PM
Slider సంపాదకీయం

కర్నాటకలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

#Karnataka Assembly

స్థానిక సంస్థల ఎన్నికలకు పలు అడ్డంకులు చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాధానంగానా అన్నట్లు కర్నాటక లో గ్రామ పంచాయితీ ఎన్నికలను నేడు ప్రకటించారు.

కర్నాటక రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. కర్నాటక రాష్ట్రంలోని 5,762 గ్రామ పంచాయితీలకు ఎన్నిక నిర్వహించనున్నారు. మొత్తం 45,791 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,70,768 మంది పోలింగ్ సిబ్బందిని దీనికోసం వినియోగించనున్నారు.

అంగన్ వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఆరోగ్య శాఖ సిబ్బందికి ఎన్నికలలో కరోనా సంబంధిత అంశాల బాధ్యతను అప్పగించారు. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని కూడా ఓటు వేయనిస్తారు. అయితే పోలింగ్ చివరి గంట సమయం వారికి కేటాయిస్తారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కరోనా పాజిటీవ్ రోగులను అన్ని జాగ్రత్తలతో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి పోలింగ్ తో బాటు కౌంటింగ్ కూడా పూర్తి చేస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో బాటు జీహెచ్ఎంసి కి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా రెండో దశ పేరు చెబుతూ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నది.

అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నది. రాష్ట్ర మంత్రుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అందరూ కూడా ఎన్నికల కమిషన్ విధులను అడ్డుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఢిల్లీతో సహా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరోనా కేసులు తగ్గిపోతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకుంటున్నది.

Related posts

మకర జ్యోతి కోసం వేచిఉన్న కోటి కన్నులు

Satyam NEWS

భారీ వర్షాల దృష్ట్యా ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు

Satyam NEWS

మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట సాగుకు మొగ్గు చూపాలి

Satyam NEWS

Leave a Comment