Slider ముఖ్యంశాలు

మొదలైన అరెస్టుల పర్వం:వెంకట రమణారెడ్డి హౌస్ అరెస్ట్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 9 గంటల వరకు కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా చేసినా, కలెక్టరేట్ రణరంగాన్ని తలపించినా కలెక్టర్ రైతుల వద్దకు రాకపోవడాన్ని నిరసిస్తూ నేడు కామారెడ్డి నియోజకవర్గ బంద్ కు రైతు జెఎసి పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి పోలీసులు వివిధ పార్టీల నాయకుల ఇళ్లవద్దకు చేరుకుని అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీకి చెందిన ముఖ్య నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

విద్యాసంస్థల బంద్

రైతులకు మద్దతుగా జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి లోని పలు ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు బంద్ కు మద్దతు తెలిపాయి. ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు

నేడు బండి సంజయ్ రాక

రైతులు చేపట్టిన ఆందోళనకు మొదటి నుంచి బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. నిన్న రైతుల ధర్నాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వెంటనే రైతులతో చర్చించి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేడు రైతులకు మద్దతుగా ఆయన కామారెడ్డికి రానున్నారు. అయితే బండి సంజయ్ రాకపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీయగా వివిధ పార్టీల నాయకులు నేరుగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ లేఖలు రాస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ని కామారెడ్డి వరకు పోలీసులు రావడానికి అనుమతిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

పకడ్బందీగా లాక్ డౌన్ అమలు: ఎవ్వరినీ వదలని ఖాకీలు

Satyam NEWS

భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసం షురూ

Satyam NEWS

నెల రోజుల పాటు జరగనున్న జగనన్న సురక్ష       

Satyam NEWS

Leave a Comment