37.2 C
Hyderabad
April 30, 2024 14: 26 PM
Slider విజయనగరం

పకడ్బందీగా లాక్ డౌన్ అమలు: ఎవ్వరినీ వదలని ఖాకీలు

#modugavalasa

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ఎక్కడిక్కడే లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలయ్యే లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ఈ మేరకు చెక్ పోస్ట్ లతో పాటు.. పోలీసుల వద్ద నుంచీ అనుమతి కోరుతూ పాస్ లుండాలని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలు ,కమీషనర్ లకు ఆదేశాలు కూడా జారీ చేసారు.

ఈ నేపథ్యంలో ఆయా సబ్ డివిజన్ ల నుంచీ పాస్ లను ఇస్తున్నారు.. సంబంధిత డీఎస్పీ లు.ఈ మేరకు విజయనగరం జిల్లా లో అత్యంత పకడ్బందీగా లాక్ డౌన్ ను అమలు పరిచేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

ఎక్కడికక్కడ ఇతర జిల్లా లు ,ప్రాంతాల నుంచే వస్తున్న వారిని పాస్ ఉంటే జిల్లాలోకి అనుమతించడం జరుగుతోంది. జిల్లాలో మోదవలస ,భోగాపురం,జమ్ము, బొడ్డవర , పార్వతీపురం లలో పోలీసులు అత్యంత పకడ్బందీగా ఎస్పీ ఆదేశాల మేరకు చెక్ పోస్టులు పెట్టి…లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.

ఏ వ్యక్తి అయినా ,ఎంతటి వారు అయినా, అదీ జర్నలిస్ట్ కానీ ఉద్యోగి కానీ ,వ్యాపారైనా..పోలీసులు జారీ చేసిన పాస్ ను ఉంటే ఇతరులను జిల్లాల్లోకి అనుమతిస్తున్నారు..పోలీసులు.

అందుకు నిదర్శనమే…వార్తల కవరేజ్ కై పొరుగు జిల్లా విశాకు వెళ్లిన జర్నలిస్ట్ ను మోదవలస వద్ద విధులు నిర్వహిస్తున్న సీఐ విజయ ఆనంద్ అడ్డుకున్నారు.

సదరు జర్నలిస్ట్ ఐడీ కార్డు ,చూపించడంతో పాటు న్యూస్ కవరేజ్ కు వెళ్లొస్తున్నాని చెప్పినా…నిబంధనల ప్రకారం పాస్ ఉండాలన్నారు. రూల్స్ ప్రకారం పాస్ ఉండాలని కానీ పక్షంలో జిల్లాలో ప్రవేశానికి అనుమతి లేదని స్పష్టం చేసారు.

అయితే అప్పటికే డీఎస్పీ నుంచీ భోగాపురం సీఐ ద్వారా సదరు సీఐ కు ఫోన్ ద్వారా సమాచారం అందడంతో విషయం తెలుసుకుని నాలుక కరుచుకుని సదరు జర్నలిస్ట్ వెహికిల్ ను వదిలి వేసారు.

ఏదైనా జిల్లాలో పోలీసులు… తు.చ.తప్పకుండా నిబంధనలు అమలు చేస్తున్నారటానికి…ఓ సీనియర్ జర్నలిస్ట్ ను అడ్డుకోవడమే ఓ నిదర్శనం.

Related posts

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రులు హరీష్, పువ్వాడ

Satyam NEWS

న‌కిరేక‌ల్ పట్టణ సుంద‌రీక‌ర‌ణ చేయడమే లక్ష్యం

Sub Editor

నవంబర్ ఒకటి నుంచి ఏడు వరకు అమరవీరుల వర్ధంతి సభలు

Murali Krishna

Leave a Comment