42.2 C
Hyderabad
May 3, 2024 15: 33 PM
Slider కవి ప్రపంచం

రుజువులు ఎక్కడ తేను

#Ch.Usharani Chandanagar

నేను

చిగురు కొమ్మల పక్షులు రెక్కలు ఇప్పుతున్న సవ్వడిని  కొలవలేను.

ఈ శరీరంలో ఇంకిన వానచినుకుల తడిరాగపు పులకింతకు లెక్క ఇంతని చూపలేను.

పిల్లన గ్రోవినుండి పారుతూ వస్తున్న గాలిపాటకు కొలతకు ఇవ్వలేను.

పట్టు పురుగులన్నీ ఎగిరిన సీతాకోకలైన రంగుల విలువ చెప్పలేను.

అడుసు తొక్కుతూ పాదముద్రలు దాచిపెట్టుకున్న మట్టిపరిమళపు ఆధారాలు చూపలేను. 

కొండల,చేనుల తడిపి ఆరబోసిన  నీటిచుక్కల రంగు తేల్చలేను

ఎండ వెన్నెలకు తడుపుకుంటున్న  జొన్నవిత్తులు ఏరుకున్న పిట్టల వారసత్వ లెక్కచెప్పలేను.

ఈ దేహం రాల్చిన స్వేద బిందువుల ధారలను తేల్చలేను.

నల్లేరు నడకలో ఇసుక రేణువుల చిరునామ  చూపలేను

తరతరాలుగా సాగిపోతున్న జీవన జాబితా ముడివిప్పలేను.

సిహెచ్. ఉషారాణి, చందానగర్, హైదరాబాద్

Related posts

కేంద్ర హోం శాఖ రక్షణ కోరిన నిమ్మగడ్డ రమేష్ కుమార్

Satyam NEWS

తిరుమలలో పారాయ‌ణానికి 100 రోజులు

Satyam NEWS

నీటి వృధా అరికట్టేందుకు జలమండలి పైలెట్ ప్రాజెక్టు

Satyam NEWS

Leave a Comment