28.7 C
Hyderabad
April 28, 2024 03: 17 AM
Slider కవి ప్రపంచం

అవనితల్లికి అభివందనం!

#K.Veena Reddy

సృష్టిలోని పంచభూతాలలో,

అతి పవిత్రమైనది అవనితల్లి..

అన్నపూర్ణకు తాను అమ్మతల్లి!

గుండెలు చీల్చి దుక్కిని దున్నినా,

సాలుసాలుకు నాగటిచాలునే ముద్దాడి,

పంట విత్తును పదిలంగా హత్తుకొని..

నేల పొరలలో పురుడును పోసిన వని..

మహిమగల మంత్రసాని మన భూజనని!

తన గర్భంనుండే ఆవిర్భవించిన

పచ్చని తరువుతల్లికీ, పువ్వుల తీగచెల్లికీ

తరగని ఆధారగని మన ఆమని అవని!

ఓ ధరణీ.. నీ గుండెలమీది కొండలతో,

ఆ కొండలమీది జలపాతాలను,

నదులను పాతాళానికింకనివ్వక,దాహార్తిని   తీర్చి, సుభిక్షతను కూర్చి

అడవులకెడదనుపరిచి వ్యాపించి,

పక్షులు జంతుజాలాలను రక్షించి,

ప్రకృతినీ పర్యావరణాన్ని పరిరక్షించే

రైతునేస్తమా.. మా జాతి సమస్తమా..

బ్రతికున్న మనిషిని గుండెలమీద మోసి,

మృతి చెందినంక నీ మృత్తికలో దాచుకొనే తల్లీ..

నీ ఋణం మేమెలాగూ తీర్చుకోలేనిది!

నిన్ను కాలుష్యం నుండి కాపాడుకోవడం మా విధి!

కె.వీణారెడ్డి, హైదరాబాద్ చరవాణి: 7337058025

Related posts

ఓమిక్రాన్‌ పై కొత్త వ్యాక్సీన్ తయారీలో రష్యా

Sub Editor

సెప్టెంబర్ 11 నుంచి స్టార్ మా లో మామగారు సీరియల్

Satyam NEWS

అప్రమత్తంగా ఉండాలి

Bhavani

Leave a Comment