38.2 C
Hyderabad
April 29, 2024 19: 30 PM
Slider మహబూబ్ నగర్

సర్వాయి పాపన్న స్పూర్తితో రాజ్యాధికారం సాధిస్తాం

#rachala

గోల్కొండ కోటను జయించిన వీరుడు,తెలంగాణ తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పూర్తితో పోరాటం చేసి, బహుజన రాజ్యాధికారం సాదిద్దామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ పిలుపునిచ్చారు.

బుధవారం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాచాల పాపన్న చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం రాచాల మాట్లాడుతూ క్షత్రీయుడే రాజ్యం ఏలాలనే సంప్రదాయాన్ని పటాపంచలు చేస్తూ, సబ్బండ కులాలను ఏకం చేసి మొగులుల రాజ్యం పై యుద్ధం చేసి విజయం సాధించిన తొలి చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.

పాపన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, ఆయన చరిత్రను పాఠ్యంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు జిల్లాలోని ఖిలాషాపూర్ లో  అగస్టు 18, 1650న జన్మించిన పాపన్న బహుజనుల రాజ్యాధికారానికి బాటలు వేశారని,వారి ధైర్యాన్ని,స్ఫూర్తిని, పుణికిపుచ్చుకుని బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.

పాపన్న గౌడ్ చరిత్ర భారతదేశంలోనే కాకుండా ఖండాంతరాలు దాటిందని, లండన్ కేంబ్రిడ్ఙి యూనివర్సిటీ వారు “ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది దెక్కన్ ఇండియన్ లైన్స్” అనే పుస్తకాన్ని ముద్రించి పాపన్న గౌడ్ మఖ చిత్రాన్ని పుస్తకంపై వేసి అతని చరిత్రను ‘రిచెడ్ హీలెన్” అనే రచయిత ప్రపంచానికి తెలియ చేశాడని,అంతే కాకుండా లండన్ విక్టోరియా మ్యూజియంలో పాపన్న గౌడ్ ముఖ చిత్రాన్ని పెట్టీ నేటికీ ప్రజల సందర్శనార్థం పెట్టారని అన్నారు.                                                                                                   

బిటీష్ వారు సైతం పాపన్న పోరాట నైపుణ్యాన్ని వీరత్వాన్ని పరిపాలన దక్షితను కొనియాడారు కానీ మన సెక్యులర్ పాలకులు మాత్రం తెలంగాణ వీరుడి చరిత్రను కప్పి పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.

అణగారిన ప్రజల కోసం పోరాడిన పాపన్న చరిత్రను పట్టించుకన్న పాపాన పోలేదని,ఇప్పటి వరకు రాసిన చరిత్రలో పాపన్న పేరు కనిపించకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

సమైక్య రాష్ట్రంలో కనుమరుగైన  పాపన్న చరిత్రను స్వరాష్ట్రంలోనైనా భావితరాలకు అందించాల్సిన బాద్యత పాలకులపై వుందని,ప్రతి రచయిత వీరి ఙీవిత చరిత్రను అద్యయనం చేయాలని కోరారు.                                                                                                                    

పాపన్న గౌడ్ నిర్మించిన కోటలను పరిరక్షించి వాటిని పర్యాటక కేంద్రాలుగా చేసి,ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీద నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రాచాల సాయన్న గౌడ్, పబ్బ నరేందర్ గౌడ్,అంజన్న యాదవ్, మద్దిగట్ల కృష్ణ గౌడ్, గడ్డం శేఖర్ గౌడ్,జనార్దన్ గౌడ్, బలిజ రమేష్, తిరుపతన్న, వెంకటన్న గౌడ్,శేఖర్, శంకర్, బాల గౌడ్,హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Related posts

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

కూటమి పేరులో ఇండియా ఉంటే సరిపోదు

Bhavani

ఆకలిదప్పుల నుంచి అన్నపూర్ణగా తెలంగాణ

Satyam NEWS

Leave a Comment