28.7 C
Hyderabad
May 6, 2024 00: 37 AM
Slider కవి ప్రపంచం

వయ్యారి నెరజాన

#aita anita

అరచేతిలో విశ్వాన్ని

అద్భుతంగా చూపిస్తూ

ఊరించే ఉడికించే

యాప్ లతో‌ కవ్విస్తూ

మాయచేసే వన్నెలాడి!

అరక్షణంలో  క్షేమసమాచారమందిస్తూనే

మనుషులను దూరంచేసి

ఆడిస్తున్న మాయలాడి!

విషయ విజ్ఞానానికి

ఉపకరిస్తూనే

వ్యసనాలకు చేరువచేస్తున్న

చిత్రాల చరవాణి!

గ్రంథాలెన్నిటినో

గూగుల్ లో చదివిస్తూ

గ్రంథాలయాన్ని

అనాధచేస్తున్నది

ముఖాలకు వర్ణాలనద్దుతూ

ముఖపుస్తకంలో మోసం చేస్తున్నది

హస్తాలతో చెలిమిచేస్తూ

మనసును దోచి

నయనాలకు హాని కలిగిస్తున్నది!

మితంగా వాడితే

మేలు చేస్తూ

ఆలోచించి ఉపయోగిస్తే

అందలమెక్కిస్తూ

అతిగా వాడితే

అపాయం కలిగిస్తూ

అనవసరంగా ఉపయోగిస్తే

ఆపదలోకి నెట్టేస్తూ

నేటి తరాన్ని తన వశం చేసుకున్న

వయ్యారి నెరజాన!

అయిత అనిత, జగిత్యాల, 8985348424

Related posts

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రానిది సక్సెస్ స్టోరీ

Bhavani

మహిళతో పాటు ఏడుగురు మట్కా నిర్వాహకులు అరెస్టు

Satyam NEWS

సం‘కుల’ సమరం: మెయిన్ పురిలో హోరాహోరీ

Satyam NEWS

Leave a Comment