ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి ఎముక విరిగింది. దాంతో ఆయనను యశోద హాస్పిటల్ లో చేర్చారు. ఈ సాయంత్రం వైద్యులు కేసీఆర్ కి శస్త్ర చికిత్స చేస్తారు. కింద పడటంతో కేసీఆర్ కి తుంటి ఎముక విరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున కార్యకర్తలు ఎవరూ ఆసుపత్రి వద్దకు రావద్దని ఆయన కోరారు. కేసీఆర్ ఆరోగ్యం కోసం అందరూ ఇంటి వద్దనే ప్రార్ధన చేయండని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు.
previous post