తాగుబోతులను చూశాం. తిండిబోతులను చూశాం. ఇతర చెడు వ్యసనాలకు బానిస అయిన వారిని చూశాం. ఇలాంటి అమ్మాయిని మాత్రం మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇంగ్లాండ్‌కు చెందిన లెసా అనే 44 ఏళ్ల గృహిణికి ఒక కొత్త అలవాటు ఉంది.
ఈ అలవాటు తన భర్తకు కూడా తెలియకుండా ఇన్ని రోజులూ దాచింది కానీ ఇప్పుడు భర్తతో సహ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. లెసా రోజుకు ఒక పూర్తి బాటిల్ పౌడర్ తింటుంది. మీరు విన్నది నిజమే. వంటికి రాసుకోవాల్సిన ఫేస్ పౌడర్ ను భోజనం చేసినట్లు చేస్తుంటుంది. ఈ వింత వ్యసనం పదిహేనేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇది ఐదవ బిడ్డను ప్రసవించిన తరువాత ప్రారంభం అయిందట.
శిశువు కు స్నానం చేసిన తర్వాత ఆ పౌడర్ ను రాసే సమయంలో ఒక సారి తిన్నదట. అదే కంటిన్యూ చేసేస్తున్నది. ఆ తర్వాత ఈ అలవాటు వ్యసనంగా మారిపోయి ప్రతి 30 నిమిషాలకు తాను పౌడర్ తీసుకుంటానని లెసా స్వయంగా వెల్లడించింది. రాత్రి పూట అయితే ఈ పౌడర్ తినడం తప్ప లెసా వేరే ఏ పనీ చేయదు.
లెసాకు జాన్సన్ & జాన్సన్ పౌడర్ అంటే ఇష్టం. రెండు రోజులకు మించి పౌడర్ తినకుండా ఉండలేదట. ఒక రోజు రాత్రి నిద్ర పట్టని ఆమె భర్త లెసా ఎందుకు తడవతడవకు బాత్‌రూం కు వెళుతున్నది అని అనుమానం వచ్చి చూశాడట. దాంతో గుట్టు రట్టయింది.దీన్ని పికా సిండ్రోమ్ అంటారట. ఈ రోగానికి మందులేదు. పాపం లెసా.