23.7 C
Hyderabad
May 8, 2024 03: 53 AM
Slider మెదక్

వ్యవసాయాధారిత పరిశ్రమలపై కేసీఆర్ దృష్టి

#sangareddymla

వ్యవసాయాధారిత పరిశ్రమలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారి అభివృద్ధికి పాటు పడిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పందుల పెంపకాన్ని బ్యాన్ చేస్తే ఎరుకల వృత్తి వారికి జీవనోపాధి లేకుండా పోయిందని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే ఎరుకల సంఘం ఏర్పాటు చేసి ఎరుకల సాధికారత కోసం కృషి చేశారన్నారు. ప్రతి మండలంలో సొసైటీ ఏర్పాటు చేసి సొసైటీల కోసం 60 కోట్లు కేటాయించారాన్నారు.

ఒకొక్క మండలంలో 2 నుంచి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని సొసైటీల కోసం కేటాయిస్తామని తెలిపారన్నారు. కులవృత్తులను ప్రోత్సహించింది కేసీఆర్ మాత్రమేనన్నారు. రాష్ట్రంలో గెలిచే అభ్యర్ధులకే సీట్లు కేటాయించారాన్నారు. ప్రతిపక్షాలు చెప్పే తొలుబొమ్మల మాటలు నమ్మవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ సీఎం అభ్యర్థులేనని, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎం అవుతానని చెప్పుకునే పరిస్థితి ఉందన్నారు. సీఎం కేసీఆర్ ఒక విజన్ తో ముందుకు సాగుతున్నారని, అలాంటి వ్యక్తి కామారెడ్డిలో పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు తప్పక ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర కోశాధికారి రవికుమార్ పాల్గొన్నారు

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

విశాఖ ఉక్కు అమ్మేస్తున్న బీజేపీ కి మద్దతు ఇవ్వడం సిగ్గు చేటు

Satyam NEWS

అహంకారపూరితంగా మాట్లాడుతున్న సిఎం కేసీఆర్

Satyam NEWS

ఇద్దరు ఛోటా దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment