22.7 C
Hyderabad
July 15, 2024 01: 22 AM
Slider తెలంగాణ

అహంకారపూరితంగా మాట్లాడుతున్న సిఎం కేసీఆర్

madiga

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని ఎమ్మెర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలో 22 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ ఆస్తులను అమ్మడంపైనే ప్రత్యేక దృష్టి పెట్టారని ఆరోపించారు. ఆర్టీసి కార్మికులకు జీతాలు ఇవ్వాలంటే బస్టాండ్లను అమ్మితేనే సాధ్యమని చెప్పి ఆర్టీసీ ఆస్తుల అమ్మకంపై క్లారిటీ ఇచ్చారన్నారు. ఒక్క సంతకంతో 7 వేల బస్సులన్ని కొనుగోలు చేస్తామని ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పకనే చెప్పారని తెలిపారు. ఆర్టీసీని కాపాడుకునే కార్మికులను సమ్మె మొదటి రోజు విధులకు రాని వారిని సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని ఆర్టీసీకి దూరం చేసారని చెప్పారు. అందులో భాగంగానే నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలే నిదర్శనమని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు అప్రమత్తంగా ఉండి సంస్థను కాపాడుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకార పూరితంగా మాట్లాడుతున్నారని అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ 150 నుంచి 2 వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిందని, అది కూడా ఒక గెలుపేనా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు అక్రమాస్తులను సంపాదించుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబానికి వచ్చిన వాటా ఎంతో కనుక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిపై దాడులు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం లేనందున ఉత్తి పుణ్యానికి వచ్చే ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను వేశారని చెప్పారు. కార్మికులు మనోనిబ్బరం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని చెప్పారు.

Related posts

జుక్కల్ కస్తూర్బ సిబ్బంది కి ఘనంగా సన్మానం

Satyam NEWS

చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తిన అమిత్ షా

Satyam NEWS

రష్యాకు అనుకూలంగా వచ్చిన ప్రజాభిప్రాయ ఫలితం

Satyam NEWS

Leave a Comment