40.2 C
Hyderabad
May 2, 2024 17: 03 PM
Slider ముఖ్యంశాలు

రేవంత్ రెడ్డి.. కరెంట్ తీగలు పట్టుకుని చూడు: మంత్రి కేటీఆర్

#ministerktr

24 గంటల కరెంట్ ఎక్కడుంది అని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డి.. కరెంట్ తీగలు పట్టుకో.. కరెంట్ ఉందో లేదో తెలుస్తుందని ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. శనివారం బిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో నిర్వహించిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం కాచాపుర్, మాందాపూర్, జనగామ, బిబిపేట మండల కేంద్రంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ వాళ్లు కరెంట్ ఎక్కడుందో చూపించుమంటున్నారు.. కరెంట్ కనిపిస్తదా ఎవరికైనా.. మనిషన్న వాళ్ళు అడిగే ప్రశ్నలేనా ఇవి అంటూ విమర్శించారు. ఏ ఊరుకు వస్తావో రా.. కరెంట్ తీగలు పట్టుకో. కరెంట్ ఉందొ లేదో తెలుస్తుందన్నారు. ఏనాడైనా కనీసం మూడు గంటల కరెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. గతంలో కరెంట్ కోసం బ్రతిమాలుకున్న రోజులు గుర్తు చేసుకోవాలన్నారు.

ఎరువుల కోసం క్యూలో నిలబడిన రోజులు మర్చిపోలేదని తెలిపారు. రాష్ట్రంలో అన్ని మంచిగా చేసుకుంటుంటే కాంగ్రెస్ వాళ్లకు మనసుకు పట్టడం లేదని విమర్శించారు. గత 60 సంవత్సరాల్లో ఏనాడైనా బీడీ కార్మికుల గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే తెలంగాణలో మాత్రమే కార్మికులకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇవ్వలేదని, ఇచ్చే వాళ్ళను తిడుతున్నారన్నారు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి  ఆగం కావద్దని సూచించారు. 9 ఏళ్లలో కొన్ని పనులు చేసుకున్నామని, మూడవసారి కేసీఆర్ సీఎం అయితే మిగిలిన పనులు పూర్తి చేసుకుంటామన్నారు. మూడవసారి సీఎం అయితే మహిళలకు 400 లకే సిలిండర్ ఇస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో 29 లక్షల మందికి పింఛన్లు ఇస్తే తెలంగాణ వచ్చాక 46 లక్షల మందికి ఇస్తున్నామన్నారు. ప్రజలు ఏ ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా కామారెడ్డి అభివృద్ధికి బాట వేయాలన్నారు

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ట్రాజిక్:బ్రిడ్జిపై నుండి వ్యాన్ బోల్తా 8మంది మృతి

Satyam NEWS

డాక్టర్ అవతారం లో విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్

Satyam NEWS

ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే అటు కేంద్ర మాజీమంత్రి

Satyam NEWS

Leave a Comment