32.2 C
Hyderabad
May 13, 2024 21: 49 PM
Slider ప్రత్యేకం

హైకోర్టులో కేసు ఉండగా దర్యాప్తు అధికారి ప్రెస్ మీట్లు ఏమిటి?

#raghurama

స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో స్కామ్ కేసు ఒకవైపు హైకోర్టులో కొనసాగుతుండగా, మరొకవైపు దర్యాప్తు సంస్థ అధికారి సంజయ్  మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ లు పెట్టడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ మంచి పాట గాడే కానీ ఆయనలో మంచి పోలీసు అధికారిని చూడలేకపోతున్నామని ఎద్దేవా చేశారు. నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ. సంజయ్ పెడుతున్న ప్రెస్ మీట్లతోక ఎలా కట్ చేయాలో  మాకు కూడా తెలుసు.

ఒక దర్యాప్తు సంస్థను  నిర్వహించే అధికారి తురుమ్ ఖాన్ లా నోటికొచ్చినట్లు  మీడియా ముందు మాట్లాడే అధికారం లేదు. అలా మాట్లాడాలి అంటే ఆయనకు ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారాలను కట్టబెట్టాలి. ప్రభుత్వం ఆ  అధికారాన్ని సంజయ్ కి కట్టబెట్టిందా?  అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రభుత్వం తనకు ఆ అధికారాలను కట్టబెట్టినట్లుగా ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సంజయ్ మీడియాతో మాట్లాడితే అది అక్రమమే అవుతుంది. ఇప్పటికైనా ఒక పోలీసు అధికారిగా సంజయ్ తన పరిమితులలో ఉండాలి. సర్వీస్ రూల్స్ ను కచ్చితంగా  అనుసరించాలి. ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని గుర్తించాలి.

ఒకవైపు కేసు కోర్టులో నడుస్తుండగా, న్యాయమూర్తి ని ఫ్రీ జుడీస్ చేసేందుకు ప్రయత్నించడం సరైనది కాదు. సంజయ్ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు సమర్పించాలి కానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడమేమిటంటూ నిలదీశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో  ఇప్పటివరకు కోర్టుకు ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. అయినా ఎవరో స్క్రిప్టు రాసిస్తే సంజయ్ మీడియా ముందుకు వచ్చి చదువుతున్నారు. ఈ కేసులో సీమెన్స్ దోషి కాదని సంజయ్ చెబుతుంటే, సీమెన్స్ కూడా దోషేనని సజ్జల అంటున్నారని రఘురామకృష్ణం రాజు  మండిపడ్డారు.

Related posts

విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించే పుస్తకాల వితరణ

Satyam NEWS

ఎన్నిక ఏదైనా గెలుపు బీఆర్ఎస్ దే

Satyam NEWS

ట్రైనీ సహాయ కలెక్టర్ విశాఖ కు చెందిన సహాదిత్ వెంకట్ త్రివినాగ్

Satyam NEWS

Leave a Comment