31.2 C
Hyderabad
May 29, 2023 21: 41 PM
Slider ప్రపంచం

లండన్ లో పెట్రేగిపోతున్న ఖలిస్తాన్ మద్దతుదారులు

#khalistan

పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్‌కు మద్దతుగా ఖలిస్తాన్ మద్దతుదారులు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల మరోసారి భారత వ్యతిరేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమం కారణంగా మెట్రోపాలిటన్ పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. అంతకుముందు ఆదివారం, లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను దించాలని ప్రయత్నించారు. అంతే కాకుండా అక్కడ ఖలిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే, భారత హైకమిషన్‌లోని ఒక అధికారి ఎంతో ధైర్యం ప్రదర్శిస్తూ ఖలిస్తానీలను అడ్డుకున్నాడు. ఖలిస్తానీ జెండాను ఎగురవేయడానికి ప్రయత్నిస్తున్న యువకుడి నుండి ఖలిస్తానీ జెండాను ఆయన స్వాధీనం చేసుకున్నాడు.

Related posts

నెలాఖరులోగా బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక ఉత్తర్వుల జారీకి చర్యలు

Satyam NEWS

విదేశీ మద్యం బ్రాండ్లను అక్రమంగా తయారుచేసే దంపతుల అరెస్టు

Satyam NEWS

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!