31.2 C
Hyderabad
May 3, 2024 01: 12 AM
Slider ఖమ్మం

ఖమ్మం పోలీస్: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

#Khammam Police

నకిలీ విత్తనాలు అమ్మినా, నిల్వ చేసినా, రవాణా చేసిన వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని ఖమ్మం జిల్లా ఎఏస్పీ స్నేహ మెహ్రా హెచ్చరించారు.  అడిషనల్ డీసీపీ లా& ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ తో కలిసి నేడు ఖమ్మం నగరంలోని వాసవి గార్డెన్ లో విత్తన, ఎరువుల షాపుల అసోసియేషన్, డీలర్లు, దుకాణా యజమానులతో సమావేశం నిర్వహించారు.

ఖరీఫ్ సీజన్‌ కావడంతో రైతన్నలు ఫర్టిలైజర్‌ దుకాణాలకు వస్తుంటారని, వారికి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు ఒరిజినల్‌ బిల్లులు ఇవ్వాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసుల సమన్వయంతో నకిలీ విత్తనాలు, కల్తీ విత్తనాలు విక్రయాలను అరికట్టేందుకు జిల్లాలో ఐదు టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

నకిలీ విత్తనాలు నిషేధిత మందులు విక్రయిస్తే లైసెన్స్‌ రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారి విజయలక్ష్మి  వివరించారు. ఎరువులు, విత్తనాలు, మందుల విక్రయాలకు తప్పకుండా రసీదులు ఇవ్వాలని సూచించారు.

లైసెన్స్‌ గల డీలర్‌ నుంచి మాత్రమే రైతులు విత్తనాలను కొనుగోలు సూచించారు. ఎఏస్పీ స్నేహ మెహ్రా, ఏసీపీ అంజనేయులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రామానుజం, సిఐ శ్రీధర్, జిల్లా వ్యవసాయ అధికారి విజయలక్ష్మి,  సరిత (ADA) ప

 శ్రీనివాస్ రెడ్డి (ADA)  కిషోర్ (వ్యవసాయ అధికారి) చాయా (వ్యవసాయ అధికారి) సందీప్ (జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్)   రామనాధం రావు, (ఖమ్మం జిల్లా విత్తనాలు మరియు ఎరువుల దుకాణాల సంఘం అధ్యక్షుడు) మనోహర్ రావు (కార్యదర్శి) తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

ఒకవైపు కర్తవ్యం.. మరోవైపు మానవత్వం చాటుకున్న ములుగు ఎస్సై హరికృష్ణ

Satyam NEWS

పండుగొచ్చింది

Satyam NEWS

మాస్కులు పంపిణీ చేసిన కార్పొరేటర్ పావని

Satyam NEWS

Leave a Comment