29.7 C
Hyderabad
May 3, 2024 04: 20 AM
Slider కవి ప్రపంచం

పండుగొచ్చింది

#Manjula Surya New

అమావాస్యలా అలుముకున్న

కరోనా కారు చీకట్లలో

వెన్నెల రేయిగా నీవొస్తుంటే

నల్లని తారురోడ్లు

ఒళ్లంతా కళ్ళు చేసుకున్నాయేమో

అన్నంతగా

నీవొచ్చే ఘడియ కోసం

గడియ తీసి నిలబడ్డట్లుగా

ఎదురుచూస్తున్నాయి

ధాన్యపు గలగలలా  వచ్చి

వాకిలి వైపు చూడొకసారి

బంధువులు బంధుత్వాలు చుక్కల్లా కలిసిపోయి నీకు స్వాగతమిస్తున్నట్లే ఉంది

ఇంకాస్త ముందుకెళ్లు

ద్వార తోరణం అనురాగ తోరణమై

వారధిలా నీకోసం పడిగాపులు కాస్తోంది

దాటుకుని వెళ్ళావా

పట్టు పరికిణీల  రెపరెపల్లో

సాంప్రదాయం నిలువెత్తు అందమై

నిను కనువిందు చేస్తుంది

వంటింటి వైపు వెళ్ళు మరి

పిండివంటలన్నీ

నవ వధువులా వయ్యారాలు పోతున్నాయి

అందీ అందకుండా అందాలని

నీ నోట్లో వెయ్యగనే కరిగిపోవాలనీ

భుక్తాయాసంగా ఉందా

మిద్దెపైనకి వెళ్లు

నింగి నేలకు వంతెన అవ్వాలనే

గాలిపటం తాపత్రయానికి

ఊతమవ్వు మరి

ఇలా అంతటా మాతో మమేకమై

ఊరంతా ఇల్లంతా మనసంతా నీవై

భోగి మంటల్లో భోగి పళ్లలో

గొబ్బిలో గంగిరెద్దు నడకలో

హరిదాసు సంకీర్తనంలో

త్రికాలాల్లా త్రికోణంలా

త్రిపతాకంలా త్రికరణంలా

త్రిమూర్తులు త్రిజగన్మాతలు

భోగి సంక్రాంతి కనుమలో

నెలవై కొలువై ఉండేలా

శుభాశీస్సులను మోసుకొస్తావని

ఆశిస్తూ

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

ఏనుగు దాడిలో అయ్యప్ప భక్తుడి మృతి

Satyam NEWS

శనీశ్వర స్వామికి తిల తైల అభిషేక పూజలు

Satyam NEWS

నిరాధార కుటుంబాన్ని ఆదుకున్న ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment