28.2 C
Hyderabad
June 14, 2025 11: 10 AM
Slider ముఖ్యంశాలు

వెరైటీ: కాబోయే తల్లుల కోసం ఆహ్లాదం పంచుదాం

KIMS

మరో ప్రాణికి జన్మనిచ్చే సమయంలో తల్లి కాబోతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూనే వారిని ఆహ్లాదకరంగా ఉంచేందుకు కిమ్స్ కడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్ వారు మిస్సెస్ మామ్ కాంటెస్టు నిర్వహించారు. తల్లి ఆరోగ్యం పైనే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పోటీ నిర్వహించినట్లు కడల్స్ వైద్యురాలు డాక్టర్ కె శిల్పి రెడ్డి వెల్లడించారు.

ఆదివారంనాడు సాయంత్రం ఈ పోటీ ఎంతో ఉత్సాహంగా జరిగిందని ఆమె వెల్లడించారు. ఆరోగ్యవంతమైన తల్లులను చూసి న్యాయ నిర్ణేతలు కూడా ఎంతో ప్రశంసించారని ఆమె తెలిపారు. వారం రోజులుగా కాబోయే తల్లు కోసం కిమ్స్ కడల్స్ గర్భసంకర్ యోగ, జల యోగా, లమేజ్ చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్, డెంటల్ చెక్, జీవన విధానం, పౌష్టికాహారం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలలో తర్ఫీదు ఇచ్చామని శిల్పి రెడ్డి వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వికారాబాద్ జిల్లా చైర్ పర్సన్ పి.సునీతా మహేందర్ రెడ్డి హాజరు కాగా మెడీకవర్ ఆసుపత్రి గైనకాలజీ విభాగం అధిపతి పద్మ డాక్టర్ మంజులా అనగాని, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గైనకాలజిస్టు డాక్టర్ అనితారెడ్డి తీగల, మిర్రర్ సెలూన్ సిఇవో డాక్టర్ విజయలక్ష్మి గూడపాటి అతిధులుగా విచ్చేశారు.

అదే విధంగా ఆపిల్ హోమ్స్ ఫర్ ఆర్ఫన్ కిడ్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ నీలిమా ఆర్య, ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణురాలు డాక్టర్ సృజనా లెక్కల, ఫ్యాషన్ డిజైనర్ మానసి పుప్పాల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

Related posts

న్యాయమూర్తులను అవమానించిన వారిపై సిఐడి కేసులు

Satyam NEWS

సిలువగిరి కొండపై ఒక వ్యక్తి దారుణ హత్య

mamatha

గాంధీభవన్ ను ముట్టడించిన భజరంగ్ దళ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!