42.2 C
Hyderabad
April 30, 2024 17: 43 PM
Slider మహబూబ్ నగర్

కిసాన్ క్రెడిట్ కార్డుతో అధిక వడ్డీ నుంచి ఉపశమనం

kisan card 1

ప్రతి ఒక్క రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పొందాలని దాని వలన రైతులు అధిక వడ్డీ భారం నుంచి ఉపశమనం పొందవచ్చునని వ్యవసాయ అధికారి  నాగరాజు అన్నారు. నేడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎల్లూరు,  చుక్కా యిపల్లి, మొల చింతలపల్లి, నరసింహాపురం గ్రామాలలో కిసాన్ క్రెడిట్ కార్డు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 ఎల్లూరులో వ్యవసాయ అధికారి  నాగరాజు మాట్లాడుతూ ప్రధానమంత్రి  సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కిసాన్ కార్డ్ క్రెడిట్ వలన రైతులు ఎరువులు విత్తనాలు పురుగుమందులు తీసుకొని 45 రోజుల లోపు ఎలాంటి  వడ్డీ లేకుండా చెల్లించ వచ్చును. రెండున్నర ఎకరాల లోపు ఉన్న రైతులు రెండు లక్షల రూపాయలను పొందవచ్చును.

రెండున్నర ఎకరాల కన్నా పైన ఉన్న రైతులకు మూడు లక్షల రూపాయల వరకు ఈ కార్డు ద్వారా పొందవచ్చునని నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ దేవమ్మ, ఉప సర్పంచ్ నాగేంద్రం, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్, సింగిల్ విండో డైరెక్టర్ శేఖర్ రెడ్డి, ఎంపీటీసీ మంజుల, రైతులు, యు.ఏ.ఇ వోలు మౌనిక, విష్ణుకుమార్ పాల్గొన్నారు.

తర్వాత గ్రామంలో  వరి పంటలను కో ఆర్డినేటర్లు పరిశీలించారు. ప్రస్తుతం వరిలో అగ్గి తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు వచ్చిందని, దీని నివారణకు propiconazole 200 ఎం.ఎల్ tricyclazole 120 గ్రాములు ప్లాంట్ మై సన్ 100 గ్రాములు ఎకరాకు పిచికారి చేసుకోవాలని తెలిపారు.

మిగిలిన గ్రామాలలో సర్పంచులు, కౌన్సిలర్లు గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, ఏ ఈ ఓ లు, రైతులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో  రైతు సమన్వయ సమితి ఇ కోఆర్డినేటర్లు, సభ్యులకు  వ్యవసాయ శాఖ క్యాలెండర్లు అందచేశారు.

Related posts

పల్లె ప్రగతి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

మీ కోసం దేనికైనా తెగిస్తా: జనసేన అధినేత

Satyam NEWS

నా ప్రాణం నిలబెట్టిన పెద్దకొడుకువు నువ్వే సారూ….

Satyam NEWS

Leave a Comment