29.7 C
Hyderabad
May 2, 2024 06: 03 AM
Slider గుంటూరు

నరసరావుపేటలో కొడాలి నాని దిష్టిబొమ్మ దహనం

#chadalawada

అత్యంత నీచమైన భాష వాడుతూ ప్రతిపక్షనాయకులను తిడుతున్న మాజీ మంత్రి కొడాలి నాని దిష్టిబొమ్మను పల్నాడు జిల్లా నరసరావుపేటలో చెప్పులతో కొట్టి తగులబెట్టారు. కొడాలి నాని డౌన్ డౌన్ అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడుతున్న కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని నరసరావుపేటలో నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు డిమాండ్ చేశారు. నీచమైన భాష వాడుతూ రాజకీయ నాయకుల స్థాయిని దిగజారుస్తున్న కొడాలి నాని ప్రజా జీవితానికి పనికిరాడని ఆయన అన్నారు.

తమ అధినేత చంద్రబాబునాయుడిని కానీ, యువ నాయకుడు లోకేష్ బాబును కానీ ఏమైనా అంటే ఊరుకునేది లేదని చదలవాడ హెచ్చరించారు. కొడాలి నానిని ప్రోత్సహిస్తున్న జగన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పట్టణ ప్రధాన రోడ్డు పై తెలుగుదేశం కార్యకర్తలు బైఠాయించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అనంతరం ర్యాలీగా వెళ్లి నరసరావుపేట ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లో కొడాలి నాని పై ఫిర్యాదు చేశారు.

Related posts

టెన్షన్: రేపే కర్ణాటక ఉప ఎన్నికల కౌంటింగ్

Satyam NEWS

హనుమంత వాహనం పై శ్రీ కోదండరామ స్వామిగా సౌమ్యనాధ స్వామి

Satyam NEWS

ప్రభుత్వ దవఖానాలో బిడ్డకు జన్మనిచ్చిన జడ్జి

Bhavani

Leave a Comment