38.7 C
Hyderabad
May 7, 2024 16: 23 PM
Slider శ్రీకాకుళం

ఘనంగా ప్రఖ్యాత బాడీబిల్డర్ కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు

#kodirammurthy

ప్రపంచ ప్రఖ్యాత బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి 139 వ జయంతి వేడుకలను శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు బడి శ్రీనివాస్ కుమార్, డాక్టర్.కె.శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ పురస్కారం దక్కిన శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్.గుండబాల మోహన్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా పాల్గొన్నారు.

ఈ అంతర్జాతీయ స్థాయి పురస్కారాన్ని కోడి రామ్మూర్తి కి అంకితం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు డాక్టర్ బి శ్రీనివాస్, డాక్టర్.కె.శ్రీధర్ లు గుండబాల మోహన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో లో శ్రీకాకుళం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు సిహెచ్.రాజేశ్వరి, ఎల్. ఢిల్లీశ్వరరావు, కె.నరేష్ కుమార్ , జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ హరి మొదలగు వారు పాల్గొన్నారు.

Related posts

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

Sub Editor

పిచ్చికుక్కలా బైరి నరేష్ వ్యాఖ్యలు

Satyam NEWS

ఇంటరాగేషన్: తట్టుకోలేక ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment