29.7 C
Hyderabad
April 29, 2024 10: 21 AM
Slider విజయనగరం

రైతుల బకాయిల చెల్లింపునకుచర్యలు

#collector

విజయనగరం జిల్లాలో  ఎన్.సి.ఎస్ చెక్కర కర్మాగారానికి   కి సంబంధించిన రైతుల బకాయిలను రెవిన్యూ రికవరీ చట్టం ప్రకారంగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఆదేశించారు. ఈ మేర‌కు తన ఛాంబర్ లో  సంయుక్త కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ , సబ్ కలెక్టర్ భావన  తో కలసి  బకాయిల చెల్లింపుల పై సమావేశం నిర్వ‌హించారు.   

ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ 2019-20, 2020-21  రెండు సీజన్ల క్రషింగ్  కు సంబంధించి   16కోట్ల 33 లక్షల  రూపాయలను,  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్  డ్యూటీ  బకాయిలు 87.50 లక్షలు, ఈ.పి.ఎఫ్ బకాయిలు 3 కోట్ల 41 లక్షలు, జి.ఎస్.టి బకాయిలు 3.36 కోట్ల రూపాయలను   ఆర్ ఆర్ ఆక్ట్ ని అమలు చేస్తూ మొత్తం 23.98 కోట్ల  బకాయిలను చెల్లించాలని అన్నారు.

ఆ మేరకు ఇద్దరు తాసిల్దార్లకు  ఆదేశాలు  జారి చేసారు.   ఈ బకాయిలను తీర్చడానికి గాను   బొబ్బిలి లో 14 ఎకరాల 67 సెంట్లు, సీతానగరం లో 5 ఎకరాల 23 సెంట్లు ఆస్తుల జప్తుకు నోటీసు లు జారి చేసి వేలం వేయాలని సూచించారు.  అందుకు అవసరమగు నిబంధనలన్నిటిని పాటిస్తూ బకాయిల చెల్లిం పూలకు అవసరమగు  చర్యలను వెంటనే చేపట్టాలన్నారు. ఈ సమావేశం లో సీతానగరం, బొబ్బిలి తహసిల్దార్లు అప్పల రాజు, రామ స్వామి , బొబ్బిలి  చెక్కర కర్మాగారం సహాయ కమీషనర్ లోకేస్వర రావు, కలెక్టరేట్ పరి పాలనా అధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజ్యాంగేత శక్తులతో రాజ్యం నడపడం అప్రజాస్వామికం

Satyam NEWS

వైద్యశాలలో స్కానింగ్ సెంటర్,రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేయాలి

Satyam NEWS

మీ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోండి చాలు

Satyam NEWS

Leave a Comment