39.2 C
Hyderabad
May 3, 2024 12: 55 PM
Slider తెలంగాణ

అధికార పార్టీ మహిమతో ఒక్కసారిగా దశ తిరిగింది

mla 67

అధికారం అంటే ఎలా ఉంటుంది? ఒక్క సారిగా పరిస్థితి మారిపోతుంది. కొందరు మహానుభావులైతే మంచి వైపు పయనిస్తారు. మరి కొందరు రివర్స్ లో వెళతారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు 19 ఏండ్లు ఎమ్మెల్యే గా, మంత్రిగా కొనసాగిన జూపల్లి కృష్ణా రావు (టిఆర్ఎస్) ను ఓడించి బీరం హర్షవర్ధన్ రెడ్డి (కాంగ్రెస్) ను గెలిపించారు. గెలిచినందుకు మార్పులు తీసుకురావాలని అనుకున్నాడు బీరం హర్షవర్ధన్ రెడ్డి. అదే విధంగా మార్పులు చేస్తున్నాడు. ముందుగా ఆయన చేసిన మార్పు ఏమిటంటే గెలిచిన కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార టిఆర్ఎస్ లోకి చేరడం. ఒక్క సారి పార్టీ మారిన తర్వాత ఆయన చాలా మార్పులు చేసేశారు. పార్టీ మారిన వెంబడే వారి తండ్రి గారికి పెండింగ్ లో ఉన్న ఒక ప్రాజెక్టు బడ్జెట్ రిలీజ్ అయిందని ప్రతిపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. తర్వాత పాల మూర్ రంగారెడ్డి ఎత్తి పోతల పథకం ప్రాజెక్టు పై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్రాస్ కోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేశారు. అది చూసే కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. పార్టీ మారిన వెంటనే ఆ కేసు వాపసు తీసుకున్నారు. అప్పటిలో కుడికిల్ల రైతుల కొరకు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ధర్నాలు ర్యాలీలు చేశారు. ఇప్పుడు అక్కడ కి వెళ్లే పరిస్థితి లేదు. న్యాయం చేస్తానని హామీ ఇస్తూవచ్చారు. వేరుశనగ విత్తనాలు ఇస్తానని రైతులకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నీటి మూటలుగానే మిగిలి పోయింది. ఇన్ని మార్పులు చూపించిన ఎమ్మెల్యే ఇప్పుడు కొత్త మార్పు ఇంకొకటి తెచ్చాడు. అదేమిటంటే వాహనం మార్చుకోవడం. చిన్న చిన్న వాహనాల్లో తిరగడం అంటే అధికార పార్టీలో ఉన్నాడు కదా నమోషీ అని పించిందేమో. ఒక్క సారిగా వోల్వో ఎక్స్90 కారు కొనేశాడు. ఎమ్మెల్యే కొత్త వాహనం శుక్రవారం రాత్రి వచ్చేసింది. ఈ వోల్వో ఎక్స్90 ఖరీదు సుమారు 1.30 కోటి లక్షలు ఉంటుందని ఆయన అనుచరులు చెపుతున్నారు. దసరాకు బుకింగ్ చేశారని తెలిసింది. దీపావళి ముందు డెలివరీ అందింది. పార్టీ మారినందుకు ఎమ్మెల్యే పరిస్థితి బాగానే ఉన్నట్లుగా కనిపిస్తున్నదని నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారు. పార్టీ మారిన ఏడాది లోపే ఇన్ని మార్పులు చూపించిన ఎమ్మెల్యే ఇంకా ఎన్ని మార్పులు చూపిస్తారో అని ప్రజలు అనుకుంటున్నారు. సోమశిల సిద్ధేశ్వరం వంతెన 98జీవో బాధితుల, మాధాసి మాధారి కుర్వల సర్టిఫికెట్ ల పై ఎన్ని మార్పులు చూపిస్తారో అని చర్చించుకుంటున్నారు.

Related posts

మాట తప్పని మనిషి ఎవరు? ఇంకెవరు ట్రంప్

Satyam NEWS

చంద్రబాబుకు అమెరికాలో వైద్య పరీక్షలు

Satyam NEWS

నీరు సకల చరాచర జీవులకు అత్యంత ఆవశ్యకం

Satyam NEWS

Leave a Comment