42.2 C
Hyderabad
April 30, 2024 18: 25 PM
Slider మహబూబ్ నగర్

క్లారిటీ: బీరం కు ఓటుతో బుద్ధి చెప్పే రోజు వచ్చేసింది

mallu ravi

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వెళ్లిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై నియోజకవర్గ ప్రజలు కసితో ఉన్నారని టిపిసిసి ఉపాధ్యక్షుడు  మాజీ ఎంపీ  డాక్టర్ మల్లురవి  అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఎమ్మెల్యేపై కసితో ఉన్నారని ఈ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.

శుక్రవారం కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ మల్లు రవి విలేకరుల సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో  పార్టీ మారిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అప్పటి నుండి ఏమీ అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లి ఎనిమిది నెలలు అవుతుంది.

అభివృద్ధి  ఏమి చేశారో  ప్రజలకు చూపించి మున్సిపల్ ప్రజలను ఓట్లు అడగాలని  ఆయన అన్నారు. ఎమ్మెల్యే నాలుగు ఏండ్లు  టిఆర్ఎస్ పార్టీలో ఏమి మాట్లాడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని ఉండాల్సిందేనని ఆయన అన్నారు. అంతే కాకుండా పార్టీ మారి ప్రాజెక్ట్ లో భూములు కోల్పోతున్న రైతులకు  ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏమి న్యాయం  చేయించాడో చెప్పాలన్నారు.

టిఆర్ఎస్ పార్టీ రెండు వర్గాలుగా పోటీ చేయడం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని మల్లు రవి అన్నారు. ప్రజల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి  రాణి గాలి యదవ్ కాబోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, ఓ బి సి సెల్ జిల్లా అధ్యక్షుడు గాలి యాదవ్, జనరల్ సెక్రటరీ రంగినేని జగదీశ్వర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తఫా, రఫీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, మండల అధ్యక్షుడు  పరశురాం, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాణి గాలి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విలేకరి శ్రీనివాస్‌ కుటుంబానికి కాప్రా ప్రెస్‌క్లబ్‌ ఆర్ధిక సహాయం

Satyam NEWS

మంత్రి జగదీష్ రెడ్డి ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా

Satyam NEWS

సిటీలో దొంగతనం.. గ్రామాల్లో విక్రయం

Murali Krishna

Leave a Comment