తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా శనివారం బంద్ జరుగుతున్నది. కొల్లాపూర్ ఆర్టీసీ డిపో కార్మికులకు మిత్రపక్షాల కాంగ్రెస్, బిజెపి, టిడిపి, సిపిఎం, జనసేన, టీజేఏసీ,సిపిఐ పార్టీ లు బందుకు మద్దతు పలికాయి. శనివారం ఉదయం టిపిసిసి కార్యనిర్వహణ కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ఓబిసి జిల్లా నాయకులు గాలి యాదవ్, సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్, టిడిపి మండల అధ్యక్షుడు రామస్వామి, బిజెపి నాయకులు సందు రమేష్, కొల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ శేఖర్ గౌడ్, మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్, సత్యనారాయణ గౌడ్, సాయి ప్రకాష్ యాదవ్, రమేష్ రాథోడ్, సిపిఎం నాయకులు శివవర్మ తదితరులు బందులో పాల్గొన్నారు. పట్టణంలోని మెయిన్ రోడ్ పై తిరుగుతూ షాపులను బంద్ చేయించారు. కొల్లాపూర్ ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బందులో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ బి.వెంకట్ రెడ్డి భద్రత చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ డిపో ముందు ఎస్ఐ కే. మురళి గౌడ్, భాగ్య లక్ష్మి రెడ్డి పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మెయిన్ రోడ్లపై పోలీస్ సిబ్బందని ఏర్పాటు చేశారు. ధర్నాలో టెంట్ కింద కూర్చున్న అఖిల పక్ష పార్టీల నాయకులను హుటాహుటిగా సిఐ.వెంకట్ రెడ్డి అరెస్ట్ చేసి పోలీస్ స్టెషన్ కు తరలించారు.శాంతి భద్రతలకు అంటంకం కలిగించరాదన్నారు. 15నిమిషాల అనంతరం విడుదల చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి మిత్ర పక్షాల మద్దతువుంటాయన్నారు. కేసీఆర్ మొండి వైఖరి సరైనది కాదన్నారు.
previous post