ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం గడువు నేటితో ముగియనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన రద్దు కావడంతో డీలా పడిపోయిన టిఆర్ఎస్ శ్రేణులు ఒక వైపు, రేవంత్ రెడ్డి ప్రచారంతో అతి ఉత్సాహంతో కాంగ్రెస్ శ్రేణులు పోలింగ్ కు సిద్ధం అవుతున్నాయి. ఎల్లుండి ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హుజుర్ నగర్ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ పూర్తి చేసింది. నేటి సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిపోతుంది. పోలింగ్ ముగిసే వరకు డబ్బు మద్యం పంపిణీ పై ప్రత్యేక నజర్ ను ఎలక్షన్ కమిషన్ పెట్టింది. రెండు ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, టిఆర్ఎస్ లు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. బిజెపి తనదైన శైలిలో ప్రచారం కొనసాగించింది. హుజూర్ నగర్ ఓటర్ తీర్పు పై ఉత్కంఠ నెలకొని ఉంది. ఈనెల 24 న ఫలితాలు వెల్లడి అవుతాయి.
previous post