ప్రముఖ సంఘ సేవకుడు, శ్రీకాకుళం జిల్లా మత్స్యకార జీవితాలలో వెలుగు నింపిన మహానుభావుడు కొమర శంకర నారాయణ జయంతిని ఎచ్చెర్ల మండలం, డి.మత్స్యలేశం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నేడే ఆయన వర్ధంతి కావడం గమనార్హం.
శ్రీకాకుళం జిల్లా మత్స్యకార కుటుంబాల కోసం కొమర శంకర నారాయణ ఎనలేని సేవ చేశారు. అప్పటిలో అక్షరాస్యత ఎంతో తక్కువగా ఉండే మత్సకార కుటుంబాలకు ఆయన నైపుణ్యాలు నేర్పి జీవితాలను సరిదిద్దారు. షిప్ లలో పని చేసే అవకాశాలను వారికి కల్పించి అందుకు అనుగుణమైన తర్ఫీదునిచ్చే వారు. బర్మాకు వలస వెళ్లిన కాందిశీకులకు ఆయన సేవలు అందించారు.
రణస్థలం మండలం చిన్న కొచ్చర్ల కు చెందిన కొమర శంకర నారాయణ పోర్టు కళింగ పట్నంలో స్థిరపడ్డారు. అక్కడే ఆయన మత్స్యకారులకు సేవ చేసేవారు. ఎన్నో భాషలు వచ్చిన ఆయన పేరుతో అనేక గ్రంథాలయాలు ఉండేవి. ప్రస్తుతం డి. మత్స్య లేశం గ్రామ పంచాయితీలో గల కొమర శంకర నారాయణ గ్రంధాలయం ఆధ్వర్యంలోనే ఆయన జయంతి, వర్ధంతి నిర్వహించినట్లు న్యాయవాది చింతపల్లి సూర్య నారాయణ సత్యం న్యూస్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతపల్లి సూర్య నారాయణ తోబాటు మైలపల్లి పాపయ్య మాష్టారు, న్యాయవాది కారి అప్పారావు, న్యాయవాది గనగళ్ళ అప్పారావు, ఫీల్ట్ అసిస్టంట్ దోని లక్ష్మణ రావు, టీచర్ కోడ లక్ష్మణ్ రావు, కోడ మూర్తి, కోడ పండు, బర్రీ కొర్లయ్య, బర్రి హరప్పుడు, కారి సురేష్, చింతపల్లి మూర్తి, వాసుపల్లి కొండబాబు, బొడ్డు అప్పన్న, వాసుపల్లి పెద్దరాజు, మైలపల్లి రమేశ్, చింతపల్లి సురేష్, కారి లక్ష్మణ్, మైల పల్లి రామకోటి, ధోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.