30.3 C
Hyderabad
March 15, 2025 09: 50 AM
Slider నల్గొండ

కోమటిరెడ్డి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న ఎంపీ ఉత్తమ్

#PCC President Uttamkumar Reddy

భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని నల్లగొండ ఎంపీ, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టినరోజు వేడుకలో పాల్గొని కేక్ కట్ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలంతా ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఇంకా, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య ఎంపీపీ మనీ మద్దే సుమన్, వైస్ ఎంపీపీ జిల్లపల్లి పరమేష్, పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

శ్రీ వాల్మీకి మహర్షి సఫాయి కర్మచారుల కార్మికుల నూతన కమిటీ

Satyam NEWS

రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా అవగాహన

Satyam NEWS

రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ స్థల పరిశీలన

mamatha

Leave a Comment