Slider కవి ప్రపంచం

ఓ మహాయోగి

#VVS Krishnakumari

సన్యాసం స్వీకరించి మహర్షి

కాబోయి,అనూహ్యంగా రాజర్షి గా

మారిన ఓ ఆథ్యాత్మిక వేత్త

భాషలకే భాషను నేర్పిన

బహు భాషా కోవిదుడు

వాగ్దేవి ముద్దుబిడ్డడు

వారసత్వపు దొరతనాన్ని స్వచ్ఛందంగా

వదలుకొని, సామాన్యుని వలె

జీవనం సాగించిన

ఓ మానవతా మూర్తి

తెలుగంటే తెలియని వారికి,

యావత్ ప్రపంచానికి

‘తెలుగు ‘అర్థం చెప్పిన

జగద్విఖ్యాత ఈ తెలంగాణ

ముద్దుబిడ్డడు

అర్థశాస్త్రాన్ని చదవక పోయినా

సుడిగుండంలో చిక్కుకొని

అగమ్యగోచరంగా తయారైన

భారత ఆర్థిక  రాజకీయ వ్యవస్థను

ఓ గాటికి తెచ్చిన అపర చాణక్యుడు

రాజకీయ చదరంగంలో

ఆటుపోట్లను తట్టుకుని

నిష్కళంకుడిగా ముద్ర

వేయించుకున్న ఓ కర్మయోగి

అవార్డు లన్నీ రాజకీయాలతో

ముడిపడి ఉన్న వ్యవస్థ లో

తెలంగాణ రత్నానికి

తెలుగు వజ్రానికి

ఈ మహా యోగికి

ప్రజల ప్రేమాభిమానాలే

ఓ పెద్ద అవార్డు

పీ.వి.యస్. కృష్ణ కుమారి, తుర్కయాంజాల

Related posts

వివేకా హత్య సమాచారం జగన్ భారతికి ముందే తెలుసు

Satyam NEWS

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

Satyam NEWS

జగన్ రెడ్డి అక్రమాలను ప్రశ్నించినందుకే నరేంద్ర అరెస్టు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!