39.2 C
Hyderabad
April 28, 2024 13: 35 PM
Slider కర్నూలు

అక్రమ సారాపై కర్నూలు జిల్లాలో ఉక్కుపాదం

#kurnoolpolice

అక్రమంగా నాటుసారా తయారీ , నిల్వ ,  అక్రమ మద్యం, అక్రమ రవాణా,  అమ్మకాలపై కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు గత వారం  రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు, సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విస్తృతంగా దాడులు చేసినట్లు సబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణ కాంత్ పటేల్ గురువారం ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.  

జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు జిల్లా పోలీసులు  సమష్టిగా నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. నాటుసారా తయారుచేసే 21 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. విస్తృత దాడులలో(సెప్టెంబర్ 21  నుండి  సెప్టెంబర్ 27  వరకు) గత వారం రోజులుగా నాటుసారా పై  15  కేసులు, 17 మంది అరెస్టు , 150 లీటర్ల నాటుసారా  సీజ్ , 1,400  లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగింది.

మొత్తం అక్రమ మద్యం పై  65  కేసులు, 116 మంది అరెస్టు , 1,194 లీటర్ల  మద్యం  సీజ్, 8 వాహానాలు సీజ్ చేయడం జరిగింది. అక్రమ మద్యం పై  10 మందిని   బైండ్ ఓవర్  చేయడం జరిగింది. నాటుసారా పై విస్తృతంగా గ్రామాలలో ఆర్ ఎస్సై , 12 మంది స్పెషల్ పార్టీ పోలీసులచే దాడులు చేస్తున్నామన్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ ,  అక్రమంగా మద్యం  రవాణా, విక్రయాలకు పలుమార్లు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్టులు కూడా నమోదు చేయడం జరుగుతుందని ఈ సంధర్బంగా తెలిపారు.

Related posts

ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీల మృతి

Satyam NEWS

మురికి నీటితో నిండిపోతున్న నాగావళి నది

Satyam NEWS

హోంగార్డు కుటుంబానికి ఆర్ధిక సహాయం అంద‌జేత

Satyam NEWS

Leave a Comment