27.7 C
Hyderabad
April 30, 2024 10: 53 AM
Slider ఖమ్మం

లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

#citu

 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్ లు కార్మికవర్గాన్ని కట్టు బానిసలను చేయడమే అవుతుందని కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చలమాల విఠల్ రావు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వెంసూర్ మండల కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో వి.సుశీల అధ్యక్షతన జరిగిన సీఐటీయూ మండల కమిటి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్లకు ప్రజా ధనాన్ని దోచి పెడుతుందని,ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కారు చౌకగా గుజరాతీ లకు కట్ట బెడుతుoదన్నారు.సీఐటీయూ మండల కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ ఐక్య పోరాటాలు దేశభక్తి యుతంగా చేయడానికి కార్యాచరణ చేసే దాని కోసం నవంబర్ 3 న సీఐటీయూ మండల మహాసభ,కార్మిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని కార్మికులు ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో మండల కో కన్వీనర్ తాళ్లూరి రామారావు,ఉపాధ్యక్షులు తుంగా శేషయ్య,డంకర శ్రీను,ఎస్.జీవమ్మ,ఆరెంపుల మల్లయ్య,సాధు శరత్,జోన్నాదుల సత్యనారయణ,కొట్టే అరుణ తదితరులు పాల్గొన్నారు

Related posts

రివెంజ్ లవ్ : తనను తిరస్కరించినందు కే హన్మకొండ యువతి హత్య

Satyam NEWS

మేడారం మినీ జాతరలో కరోనా వైరస్ కలకలం

Satyam NEWS

POK కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమే

Satyam NEWS

Leave a Comment