42.2 C
Hyderabad
April 30, 2024 16: 04 PM
Slider నల్గొండ

రైస్ మిల్ డ్రైవర్ల జీతభత్యాల విషయంలో యాజమాన్యం స్పందించాలి

#Sheetal

కార్మికుల హక్కుల సాధనకు ఐక్య పోరాటాలే శరణ్యమని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కార్మికులకు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  CITU కార్యాలయంలో రైస్ మిల్ డ్రైవర్ల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు వివిధ రూపాల్లో పోరాటాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను హరించే విధంగా కార్మిక చట్టాలు దొడ్డిదారిన తీసుకొస్తుందని విమర్శించారు.

రైస్ మిల్ యాజమాన్యాలు కార్మికుల జీతభత్యాల విషయంలో వెంటనే స్పందించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో సుదీర్ఘ పోరాటంలో ఉన్న రైతులకి సంపూర్ణ మద్దతు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో CITU జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్, రైస్ మిల్ డ్రైవర్ల యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు గుండెబోయిన వెంకన్న, గువ్వల అంజి, రెడీతి వెంకన్న,చింతకాయల పర్వతాలు, కొమ్ము రాములు, కోటయ్య, రామయ్య, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాక్ ఉగ్రమూకలపై భారత్ ఆకస్మిక దాడి

Satyam NEWS

మాఘ పౌర్ణమి సందర్భంగా నాలాయిర దివ్య ప్రబంధ మహోత్సవం

Satyam NEWS

అమ్మా కరోనా తల్లీ నీవెంత కర్కోటకురాలివే

Satyam NEWS

Leave a Comment