39.2 C
Hyderabad
May 3, 2024 12: 45 PM
Slider కరీంనగర్

అమ్మా కరోనా తల్లీ నీవెంత కర్కోటకురాలివే

#Corona Mother

ఎవరైనా ఫోన్ చేస్తే ఒక మెసేజ్ వస్తుంది. కరోనాపై వివక్ష చూపండి రోగులపై కాదు అంటూ. అయితే ఈ మెసేజీని ఆ కొడుకులు విన్నట్లు లేదు. సొంత తల్లికి కరోనా వచ్చినా వివక్ష చూపారు. ఇంట్లోకి రానివ్వలేదు. ఈ దారుణమైన అమానవీయమైన కేసు కరీంనగర్ లోని కిసాన్‌నగర్‌లో జరిగింది. షోలాపూర్ లో ఉండే ఒక తల్లి ఎంతో శ్రమపడి కొడుకుల వద్దకు వచ్చింది.

అయితే ఆమెకు కరోనా వచ్చినట్లు ఇక్కడకు వచ్చిన తర్వాత తెలిసింది. దాంతో తల్లిని కొడుకులు ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టారు. దాంతో పాపం ఆ తల్లి రోడ్డుపైనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ అశోక్ జోక్యం చేసుకుని కొడుకులకు నచ్చచెప్పారు. రోగులపై వివక్ష చూపించకూడదని ఆయన చెప్పడంతో చివరకు పెద్ద కొడుకు కనికరించాడు. ఎట్టకేలకు ఆ తల్లిని ఇంట్లోకి తీసుకెళ్లాడు పెద్ద కొడుకు. అదీ సంగతి.

Related posts

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

Satyam NEWS

కాన్ఫిడెన్స్: మునిసిపల్ ఎన్నికలలో మేమే గెలుస్తాం

Satyam NEWS

లక్కీ డ్రా స్కీమ్ లు నిర్వహిస్తే కఠిన చర్యలు: కొల్లాపూర్ సీఐ యాలాద్రి

Satyam NEWS

Leave a Comment