42.2 C
Hyderabad
May 3, 2024 17: 13 PM
Slider విజయనగరం

విజయనగరంలో పొంచి ఉన్న ప్రమాదం… పట్టించుకోని అధికార యంత్రాంగం..!

#vijayanagaramroad

విజయనగరం జిల్లా ఖ్యాతి పొందిన జిల్లా. అందునా విద్యల నగరం గానూ, ఎందరో మహానుభావులు నడియాడిన నగరంగా ప్రసిద్ధి గాంచిన నగరం. అంతే గాక కార్పొరేషన్ స్థాయి కి అడుగు పెట్టి తొలి మేయర్ పాలనలో నడుస్తున్న విజయనగరం లో ప్రమాదం పొంచి ఉంది. సత్యం న్యూస్ సాక్ష్యాలతో చూపిస్తోంది.

ఈ ఫోటోలు చూసారా…నగరంలో రద్దీ గా ఉన్న జాతీయ రహాదారికి కలిపే రింగ్ రోడ్ వద్ద ఉన్న ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్. సిగ్నల్స్ ఉన్నా విద్యుత్ అందలేదు.. దీనికి తోడు జంక్షన్ లో పెద్ద పెద్ద గుంతలు.

ఈ జంక్షన్ నుంచీ శ్రీకాకుళం వెళ్లే బస్సులు, నాతవలస వెళ్లేందుకు రహాదారి, ఆ పక్కనే విశాఖ కు వెళ్లే రహదారి అలాగే జాతీయ రహదారి 5 ను కలిపే జంక్షన్ ఈ ఐస్ ఫ్యాక్టరీ. ఇక్కడ సాయంత్రం అయ్యే సరికి విపరీతమైన రద్దీ. భారీ వాహనాలు ఓ వైపు.. నగరంలో కి వచ్చే వాహనాలతో పాటు లారీలు గూడ్స్ వెహికిల్స్ లతో నిత్యం రద్దీగా ఉంటోంది.

ఈ రద్దీ ని నియంత్రించేందుకు ట్రాఫిక్ విభాగం ఇద్దరు కానిస్టేబుళ్లను పెట్టినా…రద్దీ ని నియంత్రించలేక పోతున్నారు. అందుకు కారణం ట్రాఫిక్ సిగ్నల్స్ లేక పోవడమే.దాంతో పాటు స్ట్రీట్ లైట్లు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాన్ని కోరి తెచ్తుకుంటారని చెబుతోంది… సత్యం న్యూస్. నెట్.

తక్షణం స్ట్రీట్ లైట్లతో పాటు గుంతలున్న రోడ్లను బాగు చేయించాలని నగర ప్రజలు కోరుతున్నారు. మరి నగరపాలక సంస్థ గా ఎదిగిన విజయనగరం కార్పొరేషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related posts

రైస్ మిల్ కార్మికులకు పది రోజులు సెలవు ప్రకటించాలి

Satyam NEWS

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న విడుదల

Satyam NEWS

అవకాశం వచ్చింది దోచేసుకుంటున్నారు

Satyam NEWS

Leave a Comment