19.7 C
Hyderabad
January 14, 2025 04: 02 AM
Slider కడప

పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకపోతే మూకుమ్మడి రాజీనామాలు

అన్నమయ్య జిల్లా రాజంపేట ఎర్రబెల్లి లో భూ వివా దంలో తాసీల్ధార్ కార్యాలయం వద్ద బుధవారం వైసీపీ నేతల ఆధ్వర్యంలో గ్రామస్తుల నిరసన కార్యక్రమం చేపట్టారు.1274/11274/2 సర్వే నెంబలో 117 పేద కుటుంబాల నివాసాలకు స్థలాలు కేటాయించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంకు వైసీపీ నేత శరత్ కుమార్ రాజు, బాలరాజు ఆద్వర్యం వహించగా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎపిటిసి,జడ్పీటిసిలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ బార్ అసోషియేషన్ అధ్యక్షుడు,వైసీపీ నేత శరత్ కుమార్ రాజు మాట్లా డుతూ గతంలో ఇచ్చిన మాట ప్రకారం గ్రామస్తుల నివాసాలకు 4 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.శిల్పా రామం పోలి చెరువు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలంలో కట్టు కోవాలని సూచించారు.లేని పక్షంలో వైసీపీ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు.తెర వెనుక రాజకీయాలు చేస్తే ఒప్పుకోమని,రాజంపేట మున్సిపాలిటీని చూస్తే మీరు చేసిన అభివృద్ధి ఏంటో ఇట్టే అర్థమవుతుందని అన్నారు.

రాజంపేటలో ఎక్కడ చెత్త అక్కడే, ఎక్కడ మురికి అక్కడే ఉందని,ముందు దాని సంగతి చూడండని అన్నారు. కుక్కలకు,పందు లకు నిలయంగా రాజంపేట మున్సిపాలిటీ మారిందని అన్నారు. మున్సిపాలిటీ ప్రజల క్షేమాన్ని ముందు చూడండని, అత్యవసరంగా శిల్పారామం కటాల్చినంత అవసరం లేదన్నారు.మా గ్రామ పంచాయతీలోని స్థలం జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మాత్రమే ఈ స్థలాన్ని ఉపయోగించుకుంటామని,గ్రామపంచాయతీ సర్పంచ్ రెజల్యూషన్ లేకుండా పంచాయతీ స్థలం శిల్పారామం కు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.అనంతరం రెవెన్యూ రిసర్వే డిటి హరితకి వినతి పత్రం అందజేశారు.

Related posts

Corona Vaccine: ప్రయివేటు ఆసుపత్రులు రూ.250 మాత్రమే తీసుకోవాలి

Satyam NEWS

నేరస్తులకు శిక్ష పడేలా పోలీసు దర్యాప్తు ఉండాలి

Satyam NEWS

పిటిషన్: వైసీపీ ప్రజాప్రతినిధులపై ఏపి హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment