38.2 C
Hyderabad
April 29, 2024 12: 53 PM
Slider క్రీడలు

అంతర్జాతీయ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ లో విక్టరి విద్యార్థుల ప్రతిభ

#rapidrating

నెల్లూరులో జరిగిన మస్తానయ్య ఇంటర్నేషనల్ ర్యాపిడ్ రేటింగ్ టోర్నమెంట్ లో విక్టరి అకాడమి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుండే కాక వివిధ దేశాల నుండి ఐదువందలకు పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలలో ద్రాక్షారపు సాత్విక్  ప్రఖ్యాత కర్ణాటక క్రీడాకారుడు ఐ.ఎమ్ టైటిల్  గ్రహీత దేవకి ప్రసాద్ పై విజయం సాధించి సంచలనం సృష్టించాడు,అలాగే రేటింగ్ కేటగిరిలో ద్వితీయ స్థానం సాధించి మూడువేల రూపాయల నగదు బహుమతి , సుమారు 150 రేటింగ్ పాయింట్లు సాధించాడు. మరో క్రీడాకారుడు బండారు నానిబాబు అన్ రేటింగ్ కేటగిరిలో ప్రధమ స్థానం సాధించి మూడువేల రూపాయల నగదు బహుమతి పొందాడు. అలాగే చింతపల్లి సూర్య, తోలేటి శ్రీకాంత్ ప్రత్యేక బహుమతులు సాధించారని విక్టరి ప్రిన్సిపాల్, కోనసీమ చెస్ అసోసియేషన్ కన్వీనర్ తాడి వెంకట సురేష్ తెలిపారు.

Related posts

దళారులకు అమ్ముకున్న వరి రైతులను కూడా ఆదుకోవాలి

Satyam NEWS

ఓజో ఫౌండేషన్ ద్వారా గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో క్రొత్తగా డ్రైనేజ్ ఏర్పాటు

Satyam NEWS

కోటప్పకొండ త్రికోటేశ్వర దేవస్థానానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ గుర్తింపు

Satyam NEWS

Leave a Comment