Slider నిజామాబాద్

రైతు వేదికల నిర్మాణాల స్థలాల జాబితా అందజేత

#Bichkunda Farmers

రైతు వేదిక భవనాల నిర్మాణాల కోసం మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బసవరాజ్ పటేల్, తాసిల్దార్ వెంకట్రావు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు స్థల సేకరణ చేసి మండల వ్యవసాయ అధికారి పోచయ్య బుధవారం మండల తహశీల్ కార్యాలయ ఆవరణలో పూర్తి వివరాలతో కూడిన జాబితాను గ్రామ రెవెన్యూ అధికారి శ్రీహర్షకు అందజేశారు.

మండలంలోని గుండె నెమలి, పుల్కల్, పెద్ద దేవాడ, హస్గుల్, బిచ్కుంద గ్రామాలలో 20 గుంటల భూమి చొప్పున సేకరించి రైతు వేదిక భవనాలను నిర్మించడం జరుగుతుందని తాసిల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద రెవెన్యూ అధికారి శ్రీ హర్ష, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సౌమ్య, శ్రీలేఖ, దయానంద్, పండరీ, లక్ష్మణ్ ఉన్నారు

Related posts

Harassment: కాకినాడలో ఆర్ట్ టీచర్ ఆత్మహత్య యత్నం

Satyam NEWS

పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయండి

mamatha

వర్షం పడుతున్నా కొనసాగిన విజయనగరం పోలీసు శాఖ ‘స్పందన’

Satyam NEWS

Leave a Comment