33.2 C
Hyderabad
March 22, 2023 20: 52 PM
Slider జాతీయం తెలంగాణ

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

dgp confarence

దేశ అంతర్గత భద్రత పరిరక్షించే అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపీ సమావేశం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో హైదరాబాద్ లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. శాంతి భద్రతలు,  సైబర్ నేరాలు, మావోయిస్టు కార్యకలాపాలు,  ఉగ్రవాదచర్యలు, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై డీజీపీలు చర్చించారు. ఈ సమావేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

వాహనదారులు తస్మాత్ జాగ్రత్త… రోడ్ రూల్స్ పాటించండి…

Satyam NEWS

11 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు

Sub Editor

బిజెపి ఆధ్వర్యంలో రాజంపేట అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!