31.2 C
Hyderabad
May 3, 2024 01: 57 AM
Slider హైదరాబాద్

లాక్ డౌన్ ఖాళీతో ఎల్బీనగర్ ఎడమ ఫ్లైఓవర్ నిర్మాణం

Mayor HYD

విజయవాడ౼హైదరాబాద్  జాతీయ రహదారిపై ఎల్బీనగర్ వద్ద ఎడమ వైపు ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డంగా ఉన్న మాల్ మైసమ్మ  దేవాలయాన్ని ఆనుకుని 18 షటర్స్ తొలగించేందుకు మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎన్ ఆర్ డి సి ఎల్ సి చైర్మన్ దేవి రెడ్డి  సుధీర్ రెడ్డి సంబంధిత వ్యక్తులతో సమావేశం నిర్వహించారు.

లింగోజిగూడా డివిజన్ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, దేవాదాయ,మున్సిపల్ అధికారులతో కలిసి వారు నేడు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. లాక్ డౌన్ కారణంగా విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చే వాహనాల రద్దీ  తగ్గిన నేపథ్యంలో ఎల్.బి.నగర్ కూడలి వద్ద ఎడమ వైపు ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా చేశారు.

దీంతో ఎల్.బి.నగర్ మాల్ మైసమ్మ దేవాలయం వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కారం చేసి,యుద్ధ ప్రాతిపదికన ఫ్లై ఓవర్ పనులకు శ్రీకారం చుట్టాలని మేయర్, ఎమ్మెల్యే  క్షేత్ర స్థాయి  పర్యటన సందర్భంగా వెల్లడించారు. ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా దాదాపు 18 షాప్స్ రోడ్ వైడనింగ్ లో కూలగొడతారు.

ఆ షాప్స్ కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని మేయర్, ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు  హమీ ఇచ్చారు. ఈ క్రమంలో పూర్తిగా షాప్స్ కోల్పోయే వారికి ఖాళీగా ఉన్న మోడల్ మార్కెట్ లో వ్యాపారం చేసుకునే వెసులుబాటు కల్పించాలని జిహెచ్ యంసి అధికారులను ఆదేశించారు.

తిరిగి షాపింగ్ కాంప్లెక్స్ పూర్తి చేసిన వెంటనే వీరికి షటర్లు కేటాయిస్తారు.

Related posts

గేదెపై దాడి చేసిన బెంగాల్ టైగర్

Satyam NEWS

అప్పుడు అరిచిగోల చేసిన మోదీ… ఇప్పుడు మౌనమేల?

Satyam NEWS

స్టిల్ కంటిన్యూ:ఇరాక్ ఫై మరో రాకెట్ దాడి ఇరాన్ పనేనా

Satyam NEWS

Leave a Comment