40.2 C
Hyderabad
May 2, 2024 15: 07 PM
Slider అనంతపురం

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిద్దాం

#Maa Banyan Nuvve Jagan

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం రాంనగర్‌లోని రాయల్‌ ఫంక్షన్‌హాల్‌లో ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ కార్యక్రమంపై కార్పొరేటర్లు, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముందుగా ఈనెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్‌ గురించి వైసీపీ నగర అధ్యక్షుడు, జేసీఎస్‌ కన్వీనర్‌ చింతా సోమశేఖరరెడ్డి వివరించారు. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వంలో ఏం జరిగింది? జగన్‌ సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు? అన్న వివరాలతో రూపొందించిన కరపత్రాల పంపిణీ విధానం తెలియజేశారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 90 శాతం పైగా హామీలను నెరవేర్చామని తెలిపారు. కోవిడ్‌ వంటి పరిస్థితుల్లోనూ సంక్షేమం అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని తెలిపారు. సంక్షేమం మాత్రమే కాదని, అభివృద్దిని కూడా చేపట్టామన్నారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలకు వివరించాలని సూచించారు.

గతంలో పింఛన్‌ కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, కానీ నేడు సచివాలయ వ్యవస్థతో వాలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే నేరుగా ఇంటి వద్దకే పింఛన్‌ అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం, అభివృద్ధిని తెలియజేయాలన్నారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. నగరంలోని పలు కాలనీల్లో కేవలం మూడు, నాలుగు అడుగులున్న సందుల్లోనూ సీసీ రోడ్లు వేశామన్నారు.

అభివృద్ధి పనుల ఫొటోలను తీసి సోషల్‌ మీడియా ద్వారా విస్త్రృతంగా ప్రచారం చేయాలన్నారు. తాను ఎంపీగా ఉన్న సమయంలోనూ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైందని, కానీ టీడీపీ హయాంలో వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు జరుగుతున్న అర్బన్‌ లింక్‌ వైడనింగ్‌ ప్రాజెక్ట్‌ కూడా వైసీపీ అధికారంలోకి వచ్చాకే.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ వల్లే వచ్చిందని స్పష్టం చేశారు.

వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది కరపత్రాలకు పరిమితం అయ్యిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అనంతపురంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నారా లోకేష్‌కు అనంత వెంకటరామిరెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవుదామని తెలిపారు.

కార్యక్రమంలో జేసీఎస్‌ కన్వీనర్లు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, చింతకుంట మధు, లక్ష్మన్న, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, అహుడా చైర్మన్‌ మహాలక్ష్మి శ్రీనివాస్, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ ఓబిరెడ్డి, వైసీపీ అనుబంధ సంఘాల రీజనల్‌ కో ఆర్డినేటర్లు రమేష్‌గౌడ్, రిలాక్స్‌ నాగరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు శ్రీదేవి, కృష్ణవేణి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లా బేగ్, కార్పొరేటర్లు, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల 28న భద్రాచలంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Murali Krishna

రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది

Murali Krishna

రేపటి నుంచి చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment