28.7 C
Hyderabad
April 28, 2024 06: 13 AM
Slider ఖమ్మం

రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది

#sandra

 తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో రైతుల పండించిన ఆహార ధాన్యాలను ప్రభుత్వాలు కొనుగోలు చేయడం లేదని సత్తుపల్లి ఎం‌ఎల్‌ఎ సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర శివాలయం ప్రాంగణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా లోనే ప్రధమంగా పుల్లయ్య బంజర  ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం జిల్లా లోనే అత్యధిక అహరా ధాన్యాన్ని ఉత్పత్తి చేసే నియోజకవర్గంగా ఉండటం గొప్ప విషయమని అన్నారు.  బిజెపి కి బుద్ధి చెప్పే విధంగా, తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా పెద్ద మొత్తం లో కొనుగోలు చేస్తుందని అన్నారు. అన్నపూర్ణ గా పిలువబడే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో అత్యధిక ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసే పంజాబు కంటే మించి తెలంగాణ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుందని అన్నారు. రైతులకి బాసటగా నిలిచేందుకు కాకతీయుల కాలం నాటి చెరువులు, కుంటలను మిషన్ కాకతీయ పథకంతో పూడిక పనులు చేపించి జలకళ సంతరించుకునే విధంగా పునరుద్ధరణ చేశారన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి రైతుల అందరి ఎకౌంట్లలలో పెట్టుబడి సాయం జమ అవుతుందని అన్నారు.

Related posts

దేశ రాజకీయాలలో టెక్‌ ఫాగ్‌ యాప్ చిచ్చు

Sub Editor

వ్యవసాయ ట్రాన్సఫార్మర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్టు

Satyam NEWS

బర్త్ డే స్పెషల్: కేసీఆర్ కోసం కాశీవిశ్వనాధుడికి పూజలు

Satyam NEWS

Leave a Comment